Breaking News

Philippines: 350 మంది ప్రయాణికుల ఫెర్రీ మునక

Published on Mon, 01/26/2026 - 09:22

దక్షిణ ఫిలిప్పీన్స్ తీరంలో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. సుమారు 350 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ‘ఎం/వి త్రిషా కెర్సిన్ 3’ అనే ఇంటర్-ఐలాండ్ ఫెర్రీ.. బాసిలన్ ప్రావిన్స్ సమీపంలో నడిసంద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో  ఇప్పటివరకూ 15 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు.

జాంబోంగా సిటీ నుండి సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపానికి వెళ్తుండగా ఫెర్రీ గమ్యస్థానానికి చేరుకోకముందే ఈ దుర్ఘటన  చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో వాతావరణం అనుకూలంగానే ఉన్నప్పటికీ, సాంకేతిక లోపం తలెత్తడంతో ఫెర్రీ మునిగిపోయినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్, నేవీ దళాలు అప్రమత్తమయ్యాయి. ఫెర్రీలో ప్రయాణిస్తున్న ఒక కోస్ట్ గార్డ్, సేఫ్టీ ఆఫీసర్.. అధికారులను అప్రమత్తం చేయడంతో సహాయక చర్యలు తక్షణమే ప్రారంభమయ్యాయి. కోస్ట్ గార్డ్ నౌకలు, నేవీ షిప్‌లు, నిఘా విమానాలు, బ్లాక్ హాక్ హెలికాప్టర్లను రంగంలోకి దింపి, నీట మునిగినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 

స్థానిక మత్స్యకారులు కూడా తమ పడవలతో సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. ఇప్పటివరకు సుమారు 316 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక బృందాలు వెలికితీసిన మృతదేహాలను, బాధితులను బాసిలన్ ప్రావిన్షియల్ రాజధాని ఇసాబెలా సిటీకి తరలించారు. క్షతగాత్రులతో స్థానిక ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయని, వైద్య సిబ్బంది కొరత ఉన్నప్పటికీ బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎమర్జెన్సీ రెస్పాండర్లు తెలిపారు.

బాసిలన్ గవర్నర్ ముజివ్ హటమన్ మాట్లాడుతూ, మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా ఫెర్రీలో పరిమితికి మించి ప్రయాణికులు లేరని, జాంబోంగా నౌకాశ్రయం నుండి బయలుదేరే ముందు కోస్ట్ గార్డ్ నుండి అనుమతి లభించిందని కమాండర్ రోమెల్ దువా తెలిపారు. పడవ ఎందుకు మునిగిపోయిందనే దానిపై సమగ్ర విచారణకు అధికారులు ఆదేశించారు. ఫిలిప్పీన్స్ దేశంలో సముద్ర రవాణా అత్యంత కీలకం. భద్రతా ప్రమాణాల పాటించకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: కనిపించని ఆ నాలుగో సింహమే.. 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు