Breaking News

ట్రంప్‌పై కాల్పులు జరిపింది అతడే.. ఎఫ్‌బీఐ ప్రకటన!

Published on Sun, 07/14/2024 - 14:44

నూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో సహా ప్రపంచ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. 

ఇక, శనివారం పెన్సిల్వేనియాలో చేపట్టిన  ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌పై ఓ గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్‌ ట్రంప్ చెవిని తాకుతూ పక్కనుంచి దూసుకుపోవటంతో గాయమైంది. వెంటనే అప్రత్తమై సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు వేదిక పైకి వచ్చి.. ట్రంప్‌ను అక్కడి కిందకు దించి ఆస్పత్రికి తరలించారు.

అయితే.. ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తాజాగా గుర్తించింది. అతణ్ని 20 ఏళ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌గా ధ్రువీకరించారు. పెన్సిల్వేనియాలోని బెతెల్‌ పార్క్‌కు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. యూఎస్‌ సీక్రెట్ సర్వీస్ అధికారులు క్రూక్స్‌ను షూట్‌ చేసినట్లు ఎఫ్‌బీఐ ఏజెన్సీ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మి వెల్లడించారు. 

ట్రంప్‌ హత్యాయత్నంపై  అతని అసలు ఉద్దేశ్యం ఏంటనేదానిపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు జరిపిన కాల్పుల్లో  థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

ఇక..  థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదాడిగా నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వ రికార్డుల ద్వారా తెలుస్తోంది. కానీ, అతడు 2021లో 15 డాలర్లను డెమొక్రాట్లకు అనుబంధంగా పనిచేసే ప్రోగ్రెసీవ్‌ టర్న్‌ఔట్‌ ప్రాజెక్టకు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.  ప్రస్తుతం క్రూక్స్‌ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆ మార్గంలోకి ఎవరినీ రానీవ్వకుండా  భద్రత పెంచారు. 

మరోవైపు.. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపుతామని ఎఫ్‌బీఐ ప్రకటించింది. దర్యాప్తుకు కొన్ని నెలల సమయం పట్టవచ్చునని తెలిపింది. ఈ కాల్పులు ఘటనకు సంబంధిచి ఏదైనా సమాచారం తెలిస్తే.. తమకు చెప్పాలని ర్యాలీకి హాజరైన ప్రజలను ఎఫ్‌బీఐ కోరింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)