Breaking News

బోట్‌ రైడ్‌లో ఒక్కసారిగా రాకాసి అలలు, వీడియో వైరల్‌

Published on Sun, 02/15/2026 - 12:10

అమెరికాలోని కాలిఫోర్నియాలో శాంటాక్రూజ్ సమీపంలో సముద్రంలో బోటు ప్రమాదంనుంచి ఒక కుటుంబం తృటిలో తప్పించుకుంది.  బోటింగ్‌ చేస్తున్న సమయంలో భారీ అలలు విరుచుకుపడటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. అదృష్టవశాత్తూ కుటుంబంలోని ఆరుగురు సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. ఎలా? తెలుసు కుందాం.

సముద్రం తీరానికి వెళ్లినపుడు బోటింగ్‌కి వెళ్లడం సర్వ సాధారణం. అలా నలుగురు పిల్లలతో ఒక  జంట కూడా బోటింగ్‌కు వెళ్లింది.  చాలా ఉత్కంఠ భరితంగా  రైడ్‌ను ఆస్వాదిస్తున్నారు వారంతా. పడవ నెమ్మదిగా ఒడ్డు వైపు కదులుతోంది. ఇంతలో అకస్మాత్తుగా రాకాసి అలలు విరుచుకు పడ్డాయి. అలల ధాటికి పడవ తిరగపడింది. అనేక మంది సర్ఫర్‌లను దాటి దూసుకెళ్లి, పడవ పల్టీలు కొట్టడంతో  మొత్తం ఆరుగురూ నీటిలో మునిగి పోయారు. ఈ దృశ్యాలు సర్ఫర్లను రికార్డు చేస్తున్న వారి దృష్టిలోపడింది. వెంటనే వారిని రక్షించేందుకు రంగంలోకి దిగారు. సర్ఫర్లు, విరోస్ట్కో,అతని స్నేహితుడు ట్రైక్, ఇతర సర్ఫర్లు తక్షణమే స్పందించారు. సమయస్ఫూర్తితో వారిని ఒడ్డుకు చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తూ, సర్ఫర్లలో ఎవరికీ గాయాలు కాలేదు. 

ఈ సంఘటన ఫిబ్రవరి 13, 2026న శాంటా క్రజ్ వెస్ట్ క్లిఫ్ డ్రైవ్ సమీపంలో జరిగింది. మూడుసార్లు మావెరిక్స్ విజేత డారిల్ 'ఫ్లీ' విరోస్ట్కోతో సహా సర్ఫర్ల బృందం ఈ కుటుంబాన్ని రక్షించేందుకు చొరవ చూసి అనేక ప్రశంసలందుకుంది. 

శాంటా క్రజ్ అగ్నిమాపక విభాగం
డిపార్ట్‌మెంట్ వాటర్ రెస్క్యూ విభాగం దీనిపై స్పందించింది. ఆరుగురు బాధితులను విజయవంతంగా రక్షించిన స్థానిక సర్ఫింగ్ కమ్యూనిటీ, ఇతర ఏజెన్సీలను అభినందించింది. ఈ సంఘటనకు ఖచ్చితమైన కారణాలు, భద్రతా ప్రోటోకాల్స్‌ పాటించారా? లేదా అనేదానిపై  దర్యాప్తు చేస్తోంది.

ఇదీ చదవండి: FASTag వార్షిక పాస్ తీసుకుంటున్నారా? ఎన్‌హెచ్‌ఏఐ తాజా హెచ్చరిక!

బిగ్ వేవ్ సర్ఫర్ డారిల్ 'ఫ్లీ' విరోస్ట్కో మాట్లాడుతూ నమ్మలేకపోతున్నా.. కానీ చిన్న పిల్లలతో అందరూ ఈ పడవ ప్రమాదం నుండి బయటపడ్డారంటూ ఆనందాన్ని ప్రకటించారు. మరోవైపు  బోటింగ్‌ సమయంలో లైఫ్‌ జాకెట్లు ధరించడం తప్పనిసరి. ఈ ప్రమాదంలో వీరంతా లైఫ్‌ జాకెట్లను ధరించలేదని తెలుస్తోంది.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)