Breaking News

ప్రియుడు ఫోన్‌ ఎత్తలేదని.. ఈ కొత్త జబ్బు గురించి తెలుసా?

Published on Thu, 04/25/2024 - 15:30

ఆమె వయసు 18 ఏళ్లు. గత కొన్ని నెలలుగా ఓ వ్యక్తితో గాఢమైన ప్రేమలో ఉంది. ప్రియుడంటే చచ్చేంత ఇష్టం.  కానీ, ఆ ఇష్టం ఆ వ్యక్తికి తలనొప్పిగా మారింది. దీంతో ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. ఫోన్లు లిఫ్ట్‌ చేయడం మానేశాడు. మానసికంగా కుంగిపోయిన ఆమె ‘లవ్‌ బ్రెయిన్‌’ బారిన పడి ఆస్పత్రిలో చేరింది. 

లవ్‌ బ్రెయిన్‌(Love Brain).. మెడికల్‌ డిక్షనరీలో ఎంత వెతికినా కనిపించని ఒక జబ్బు. అయితే బార్డర్‌ లైన్‌ పర్సనాలిటీ డిజార్డర్‌లో ఇదొక భాగమని మాత్రం వైద్యులు గుర్తించారు. తాజాగా చైనాలో ఓ యువతి ఈ మానసిక జబ్బుతోనే ఇబ్బంది పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. తద్వారా దీని గురించి చర్చ నడుస్తోంది.

గ్జియాయూ(18) కాలేజీ స్టూడెంట్‌.గతకొంతకాలంగా తన ప్రియుడి మీదే ఆమె ఎక్కువగా దృష్టి పెడుతూ వస్తోంది. ఎప్పుడూ తనతో కాంటాక్ట్‌లో ఉండాలని, ఆ యువకుడు తాను ఎప్పుడు.. ఎక్కడ ఉంటున్నాడనే విషయం చెబుతూ ఉండాలంటూ  ఒత్తిడి చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో విసిగిపోయిన ఆ యువకుడు ఆమెకు దూరంగా ఉంటూ వచ్చాడు. 

ఒకరోజు వందకిపైగా ఫోన్‌ కాల్స్‌ చేసినా అతను సమాధానం ఇవ్వలేదు. దీంతో.. ఆమె అతనికి పలు సందేశాలు పంపింది. అనుమానం వచ్చిన ఆ యువకుడు పోలీసులకు సమాచారం అందించాడు. వాళ్లు ఆమె ఇంటికి వెళ్లి చూడగా.. ఇంట్లో వస్తువులు పగిలిపోయి ఉన్నాయి. బాల్కనీ నుంచి దూకేస్తానంటూ ఆమె అందరినీ కాసేపు ఆందోళనకు గురి చేసింది. చివరకు.. ఎలాగోలా ఆమెను నిలువరించి పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడే ఆమెకు లవ్‌ బ్రెయిన్‌ సోకిందని వైద్యులు నిర్ధారించుకున్నారు. 

ఎవరికి సోకుతుందంటే..
ప్రేమలో, రొమాంటిక్‌ రిలేషన్స్‌లో ఉన్నవాళ్లు ఈ లవ్‌బ్రెయిన్‌ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రేమలో అవతలి వాళ్లు ఎప్పుడూ తమ గురించే ఆలోచించాలని అనుకోవడమే కాదు.. వాళ్ల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడమే లవ్‌ బ్రెయిన్‌ జబ్బులోని ప్రధాన లక్షణం. ఆ ఆలోచించడంలోనూ ఒకస్థాయి దాటి పోతుంటారు దీని బారిన పడ్డవాళ్లు. ఇది బార్డర్‌లైన్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ కోవ కిందకు వస్తుంది. దీనివల్ల విపరీతమైన ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురవుతారని.. చివరకు బైపోలార్‌ డిజార్డర్‌​ బారినపడే అవకాశం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కారణాలు.. 
లవ్‌ బ్రెయిన్‌ ఎక్కువ కేసుల ఆధారంగా.. తల్లిదండ్రుల నుంచి ప్రేమాభిమానాలు దొరకనప్పుడు.. చిన్నతనంలో మమకారాలకు దూరమైనప్పుడు.. ఇలాంటి మానసిక సంఘర్షణకు లోను కావొచ్చని వైద్య నిపుణులు గుర్తించారు.  మానసికంగా.. భావోద్వేగాల్ని నియంత్రించుకునే పద్ధతులతో ఈ స్థితి నుంచి బయటపడే అవకాశం ఉందని, అయితే విపరీత పరిస్థితుల్లో మాత్రం చికిత్స అవసరం పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రేమ ఒక రోగం.. అందునా అతిప్రేమ కూడా ఒక రోగమనేది దీంతో తేలిపోయిందన్నమాట!. 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)