Breaking News

భారత్, అమెరికా విదేశాంగ మంత్రుల భేటీ

Published on Tue, 09/23/2025 - 05:46

న్యూయార్క్‌: భారత్‌పై అమెరికా సర్కార్‌ 50 శాతం టారిఫ్‌ భారం మోపడంతో ఇరుదేశాల నడుమ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ రెండు దేశాల విదేశాంగ మంత్రులు న్యూయార్క్‌లో భేటీ అయ్యారు. లొట్టె న్యూయార్క్‌ ప్యాలెస్‌లో సోమవారం ఉదయం భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోలు సమావేశమయ్యారు. భారత్‌పై అమెరికా 50శాతం టారిఫ్‌ విధించాక ఇరునేతలు కలవడం ఇదే తొలిసారి. ‘‘ద్వైపాక్షిక అంశాలుసహా మారుతున్న అంతర్జాతీయ పరిణా మాలపై విస్తృతస్థాయిలో చర్చించుకున్నాం.

 కీలక అంశాల్లో పురోగతి కోసం నిరంతరం సంప్రతింపులు ముఖ్యమని ఇద్దరం భావించాం’’అని భేటీ తర్వాత జైశంకర్‌ ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌పెట్టారు. ఇదే నగరంలో అమెరికా వాణిజ్యమంత్రితో భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూశ్‌ గోయెల్‌ బృందం భేటీకానుంది. పరస్పర ప్రయోజనకర వాణిజ్య ఒప్పందం ఖరారు కోసం ఈ సమావేశం జరగనుంది. అమెరికా పత్తి, డెయిరీ, తదితర వ్యవసాయ ఉత్పత్తులను భారతీయ మార్కెట్లోకి తేవాలని ట్రంప్‌ యత్నిస్తుండగా అవి వస్తే భారతీయ రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని భారత్‌ వాదిస్తోంది. దీంతో ఏకాభిప్రాయం కుదరక ఇంకా ఈ ఒప్పందం ఖరారుకాలేదు. 
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి