Breaking News

డెన్మార్క్‌: ఇజ్రాయెల్‌ ఎంబసీ సమీపంలో పేలుడు

Published on Mon, 10/07/2024 - 15:42

కోపెన్‌హాగన్‌: డెన్మార్క్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించింది. ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపు దాడి చేసిన నేటికి (అక్టోబర్‌ 7 తేదీ) ఏడాది. ఈ నేపథ్యంలోనే పేలుడు సంభవించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోపెన్‌హాగన్‌లోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయానికి 500 మీటర్ల దూరంలో పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. 

ఇజ్రాయెల్‌ రాయబార భవనానికి సమీపంలో ఐదు రోజుల క్రితం రెండు పేలుళ్లు సంభవించిన తర్వాత మళ్లీ పేలుడు జరగటం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం జరిగిన పేలుళ్లలో ఇద్దరు స్వీడిష్ జాతీయులను పోలీసులు అరెస్టు చేశారు.

 

క్రెడిట్స్‌: The Daily Star

‘‘ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో ఇటీవల జరిగిన సంఘటనకు సంబంధం ఉందా? లేదా? అనే విషయం పరిశీలిస్తున్నాం’’ అని కోపెన్‌హాగన్ పోలీసు ఇన్‌స్పెక్టర్ ట్రిన్ మొల్లెర్ తెలిపారు. ఈ ఘటనకు  సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. అయితే.. ఈ పేలుడు ఘటన తుపాకీ కాల్పుల వల్ల సంభవించి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను స్థానిక మీడియా ప్రసారం చేసింది.

మరోవైపు.. డెన్మార్క్‌లో ఇటీవల అక్టోబర్ 2న  జరిగిన పేలుళ్లలో ఇరాన్ ప్రమేయం ఉండవచ్చని, స్టాక్‌హోమ్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన కాల్పుల్లో సైతం ఆ దేశ ప్రమేయం ఉందని స్వీడన్ గూఢచార సంస్థ సపో అనుమానం వ్యక్తం చేసింది.

చదవండి: కిమ్‌ కాదు, సోరోస్‌ కాదు.. ఉపవాసానికే నా ఓటు!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)