Breaking News

‘‘రష్యా ఎన్నికలు ఒక బూటకం.. చనిపోయేదాకా పుతిన్‌దే పవర్‌’’

Published on Sat, 03/16/2024 - 09:43

లండన్‌: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చనిపోయే వరకు పవర్‌లోనే ఉంటాడని, ప్రస్తుతం జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలు కింది నుంచి మీది దాకా ఒక భూటకం అని యాంటీ కరప్షన్ యాక్టివిస్ట్‌, రష్యా నుంచి బహిష్కరణకు గురైన ఇన్వెస్టర్‌ బిల్‌ బ్రౌడర్‌ వ్యాఖ్యానించారు. అధ్యక్షఎన్నికల వేళ బ్రౌడర్‌ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.

‘దేశ ప్రజలకు జైలు, చావు తప్ప పుతిన్‌ ఇచ్చేది ఏమీ లేదు. ఇది ఒక గొప్ప లీడర్‌ లక్షణం కాదు. పుతిన్‌  ప్రజలను ఇంకా అణచివేస్తే తిరుగుబాటు తప్పదు. ప్రజలు డిసైడైతే పుతిన్‌కు రొమేనియా కమ్యూనిస్టు లీడర్‌ నికోలే సెస్క్యూకు పట్టిన గతే పడుతుంది’అని బిల్‌ బ్రౌడర్‌ హెచ్చరించారు. హెమిటేజ్‌ క్యాపిటల్‌ అనే కంపెనీ ద్వారా రష్యాలో 1990 నుంచి 2000 సంవత్సరం వరకు భారీగా పెట్టుబడులు పెట్టిన బిల్‌ బ్రౌడర్‌ను అవినీతి ఆరోపణలపై 2005లో దేశం నుంచి బహిష్కరించారు.

కాగా,  తొలుత రష్యా గూఢచర్య సంస్థ కేజీబీ  ఏజెంట్‌గా పనిచేసిన పుతిన్‌ 1999 నుంచి రష్యాలో అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లోనూ పుతిన్‌ గెలుపు ఖాయమేనన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో మరో ఆరేళ్లపాటు పుతిన్‌ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. మార్చి 15న ప్రారంభమైన రష్యా ఎన్నికలు 17 దాకా మూడు రోజుల పాటు జరగనున్నాయి. 

ఇదీ చదవండి.. కెనడాలో భారత సంతతి ఫ్యామిలీ అనుమానాస్పద మృతి 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)