Breaking News

2023లో ఎవరెస్ట్‌ను ఎందరు అధిరోహించారు? సరికొత్త రికార్డు ఏమిటి?

Published on Sat, 12/30/2023 - 08:51

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని గడచిన 70 ఏళ్లలో అధిరోహించిన వేలాది మంది పర్వతారోహకులు సరికొత్త రికార్డులు సృష్టించారు. వీరిలో పలువురు భారతీయులు కూడా ఉన్నారు. గత 70 ఏళ్లలో సుమారు ఏడు వేల మంది పర్వతారోహకులు ఎవరెస్ట్‌ను అధిరోహించారు. 

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరుగుతున్న హిమానీనదాలు, మంచు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ, పర్వతారోహణ సంఘం ఈ సంవత్సరం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన 70వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. 2023లో నలుగురు భారతీయులతో సహా దాదాపు 500 మంది పర్వతారోహకులు ఈ ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించారు. న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ, నేపాల్‌కు చెందిన షెర్పా టెన్జింగ్ నార్గే 8,848.86 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని 1953, మే 29న ఆవిష్కరించారు.
 
ఎవరెస్ట్ పర్వతాన్ని నేపాలీ భాషలో సాగరమాత అని అంటారు. ఎడ్మండ్-నార్జ్ 1953లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత దాదాపు 7000 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. ఇప్పటివరకూ 300 మందికి పైగా పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారని అధికారిక సమాచారం. 2023లో మొత్తం 478 మంది పర్వాతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఈ ఏడాది నలుగురు భారతీయులు ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
 
భారత్‌కు చెందిన యాషి జైన్, మిథిల్ రాజు, సునీల్ కుమార్, పింకీ హారిస్ మే 17న ప్రపంచంలోనే ఎత్తయిన ఈ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. భారత పర్వతారోహకురాలు సుజానే లియోపోల్డినా మే 18న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నంలో మరణించారు. ఈ ఏడాది ఎవరెస్ట్ పర్వతారోహణ యాత్రలో నలుగురు నేపాలీలు, ఒక భారతీయ మహిళ, ఒక చైనీస్ సహా 11 మంది పర్వతారోహకులు మరణించారు. ఎనిమిది మంది గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. 2023లో నేపాల్‌కు చెందిన కమీ రీటా షెర్పా (53) ఎవరెస్ట్ శిఖరాన్ని 28 సార్లు అధిరోహించి, సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. 
ఇది కూడా చదవండి: 2023లో భారత్‌- చైనా సంబంధాలు ఎలా ఉన్నాయి?

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)