Breaking News

గాజాలో ఆకలి కేకలు

Published on Sun, 05/04/2025 - 01:14

గాజా: ఇజ్రాయెల్‌ ఆర్మీ రెండు నెలలుగా కొనసాగిస్తున్న దిగ్బంధం గాజాలోని పాలస్తీనియన్లను ఆకలి చావుల ప్రమాదపుటంచుకు చేర్చింది. ఆహారం, నీరు, మందులు, ఇంధనం వంటి అత్యవసరాలను సైతం సైన్యం అడ్డుకోవడంతో సరఫరాల తో వస్తున్న ట్రక్కులు వందలాదిగా సరి హద్దుల్లోనే నిలిచిపోయాయి. తమ వద్ద ఉన్న సరుకుల నిల్వలు మరో రెండు వారాలకు మాత్రమే సరిపోతాయని గాజా ప్రజలకు ఆహారం అందిస్తున్న సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

ఈ లోగా ఇజ్రాయెల్‌ నిర్ణయం మా ర్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అలాకాని పరిస్థితుల్లో ఇప్పటికే అర్ధాకలితో అలమటిస్తు న్న లక్షలాది మంది పాలస్తీనియన్లకు ఆకలి చావు లు తప్పవని హెచ్చరిస్తున్నాయి. తమ వద్ద ఉన్న నిత్యావసర సరుకుల నిల్వలు పూర్తిగా అడుగంటాయని ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం(యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ) తెలిపింది. మానవతా సాయం, పౌరుల ప్రాణాల విషయంలో బేరమాడటం సరైన విధానం కాదని ఐరాస మానవతా విభాగం చీఫ్‌ టామ్‌ ఫ్లెచర్‌ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు.

తీవ్రమైన పోషకాహార లోపం కారణంగా ఐదేళ్లలోపు వయస్సున్న 3.35 లక్షల మంది చిన్నారులు మరణం అంచున ఉన్నారని యునిసెఫ్‌ ఇప్పటికే హెచ్చరించింది. ఇది యుద్ధ నేరమేనని, ఇంతటితో ఆపాలని అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిడులు వస్తున్నటికీ ఇజ్రాయెల్‌ లక్ష్యపెట్టడం లేదు. బందీలందరినీ హమాస్‌ విడిచిపెట్టేదాకా దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేస్తోంది. ఇజ్రాయెల్‌ బలగాలు గాజా నుంచి పూర్తిగా వైదొలిగేదాకా వెనక్కి తగ్గేది లేదని హమాస్‌ సైతం భీష్మించుకుంది.  

మటన్‌ బదులు కొషారి 
అమెరికన్‌ నియర్‌ ఈస్ట్‌ రెఫ్యూజీ ఎయిడ్‌(అనెరా) గాజాలో రెండు సామాజిక వంటశాలలను నడుపుతోంది. ఖాన్‌యూనిస్‌లో ని కమ్యూనిటీ కిచెన్‌ రోజుకు 6 వేల మందికి సరిపడా ఆహారం వండుతోంది. ప్రస్తు తం ఆకుకూరలు, బియ్యం, టమాటా సాస్‌లతో కూడిన కొషారి అనే వంటకాన్ని వండి వడ్డిస్తున్నామని నిర్వాహకుడు సమీ మ తార్‌ చెప్పారు. ఆహార నాణ్యతను పరీక్షించాకే పార్శిల్‌ చేస్తామని, ఒక్కో పార్శిల్‌లోని ఆహారం నలుగురికి సరిపోతుందని వివరించారు.

మిగిలిన ఆహారాన్ని శరణార్థి శిబిరాలున్న అల్‌ మవాసీకి తరలించి, డజన్ల సంఖ్యలో ఉన్న సూపర్‌ వైజర్ల సాయంతో పంపిణీ చేస్తున్నామన్నారు. ‘గతంలో వారానికి వంద చొప్పున ట్రక్కుల్లో ఆహారం, మందులు ఇక్కడికి చేరేవి. ఈ ఏడాది ఆరంభంలో కాల్పుల విరమణ సమయంలో వచి్చన ఆహార పదార్థాలు, నిత్యావసరాలను నిల్వ ఉంచాం. దిగ్బంధనం కారణంగా ఆ నిల్వలు కరిగిపోయాయి. సరఫరా నిలిచిపో వడంతో స్థానిక దుకాణాలు మూతబడ్డాయి. దీంతో, ఎలాంటి ఆదాయ వనరు లు లేని వారు మేమందించే ఆహారంపైనే పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నారు. 

వీరి కోసం గతంలో అన్నం, మాంసం వండే వాళ్లం. మాంసం దుకాణాలు మూతబడ్డాయి. బియ్యం, ఆకు కూరలు, పాస్టా, వంటనూనె, ఉప్పు వంటివి సైతం దొరక డం కనాకష్టంగా మారింది. గ్యాస్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో వంట కోసం 700 కిలోల కట్టెలు కొంటున్నాం. వంట చెరుకు ధర సైతం పెరిగిపోయింది. సరుకుల కొరత కారణంగా వచ్చే రెండు వారాల్లోపే ప్రజలకు ఏకైక ప్రాణాధారమైన ఇక్కడి కిచెన్లన్నీ మూతబడే ప్రమాదముంది’అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతమున్న సరుకులు కూడా ఖర్చయిపోతే ఆ తర్వాత ఏం చేయాలో తెలియడం లేదని మతార్‌ నిర్వేదంతో అ న్నారు. మానవతా సాయం నిల్వలను హమాస్‌ శ్రే ణులు దోచుకుంటున్నాయంటూ ఇజ్రాయెల్‌ చేస్తున్న ఆరోపణలను మతార్‌ కొట్టిపారేశారు. ఇక్కడ ప్రతిదీ పారదర్శకంగా క్రమపద్ధతిలో జరుగుతోందని, బ యటి వ్యక్తుల ప్రమేయం ఉండదని పేర్కొన్నారు. 

చిన్నారి ఆకలి చావు 
గాజా సిటీలోని రంటిసి హాస్పిటల్‌లో శనివారం జనన్‌ సలెహ్‌ అల్‌–సకఫీ అనే చిన్నారి కన్నుమూసింది. పోషహాకాహార లోపం, డీహైడ్రేషన్‌ ఆమె ఉసురు తీశాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇదంతా ఇజ్రాయెల్‌ చేసిన పాపమేనని కుటుంబసభ్యులు దుమ్మె త్తి పోశారు. 

63 రోజులుగా సాగుతున్న ఇజ్రా యెల్‌ దిగ్బంధనం ఫలితంగా కనీసం 57 మంది పాలస్తీనా బాలలు ఆకలి చావులకు గురయ్యారని గాజా ప్రభుత్వం తెలిపింది. రఫా సహా అన్ని సరిహద్దులను తెరిచి, గాజాలోని 24 లక్షల మంది పాలస్తీనవాసులకు మానవీయ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది.   

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)