Breaking News

హెచ్‌ఐవీకి సూదిమందు ఆమోదించిన ఈయూ

Published on Sat, 07/26/2025 - 05:08

లండన్‌: హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ను అడ్డుకునే సూదిమందు ‘లెనకపవిర్‌’కు యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)కు చెందిన మెడిసిన్స్‌ ఏజెన్సీ ఆమోదం తెలిపింది. ఏడాదిలో రెండు పర్యాయాలు తీసుకునే ఈ ఔషధం వైరస్‌ వ్యాప్తిని నివారించడంలో సాయపడుతుందని పేర్కొంది. యూరప్‌లో దీనిని యెయ్‌టువో అనే పేరుతో గిలియడ్‌ సైన్సెస్‌ విక్రయాలు జరుపుతుంది. దీంతో ఈయూలోని 27 సభ్య దేశాలతోపాటు ఐస్‌ల్యాండ్, నార్వే, లీచిన్‌స్టెయిన్‌ల్లోనూ ఇది అందుబాటులోకి వస్తుంది. 

లెనకపవిర్‌తో హెచ్‌ఐవీ బాధిత మహిళలు, పురుషులకు చికిత్స చేయగా 100 శాతం ప్రభావవంతంగా పనిచేసినట్లు గతేడాది చేపట్టిన అధ్యయనంలో తేలింది. హెచ్‌ఐవీ మహమ్మారిని తరిమికొట్టడంలో లెనకపిర్‌ కీలక మలుపుగా మారనుందని ఐరాస ఎయిడ్స్‌ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విన్నీ తెలిపారు. జూన్‌లో అమెరికా ప్రభుత్వ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ సైతం లెనకపవిర్‌ను ఆమోదించింది. 

ఐరాస ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్‌ఐవీ వైరస్‌ నివారణలో లెనకపవిర్‌ ఎంతో సహాయకారికానుందని పేర్కొంది. ఒకసారి ఈ సూది మందు తీసుకుంటే ఆరు నెల్లపాటు హెచ్‌ఐవీ సోకకుండా ఆపగలుగుతుంది. కాగా, లెనకపవిర్‌ను తక్కువ ధరలో హెచ్‌ఐవీ కేసులు తీవ్రంగా ఉండే ఆఫ్రికా, ఆసియా, కరీబియన్‌ ప్రాంతాల్లోని 120 పేద దేశాలకు సరఫరా చేస్తామని గిలియడ్‌ సైన్సెస్‌ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల హెచ్‌ఐవీ బాధితులుండగా 2024లో సుమారు 6.30 లక్షల మంది చనిపోయినట్లు అంచనా.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)