ఇథియోపియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం.. 

Published on Sat, 08/05/2023 - 13:35

అడిస్ అబాబా: ఇథియోపియాలో ఆ దేశ ప్రభుత్వం శుక్రవారం ఎమర్జెన్సీని ప్రకటించింది. గత కొంతకాలంగా ఉత్తర అమ్హారా ప్రాంతంలో ఫెడరల్ భద్రతా దళాలకు స్థానిక మిలీషియాలకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇక ఇదే వారంలో ఇథియోపియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్, ఫానో మిలీషియా గ్రూప్ మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగినట్లు స్థానిక మీడియా నివేదించింది. 

పొరుగున ఉన్న టైగ్రే ప్రాంతంలో రెండు సంవత్సరాల పాటు జరిగిన అంతర్యుద్ధం కారణంగానే ఈ ఘర్షణలు చెలరేగినట్లు చెబుతోంది ఇథియోపియా ప్రభుత్వం. సాధారణ న్యాయ వ్యవస్థ ఆధారంగా ఈ దారుణాలను నియంత్రించడం కష్టతరంగా మారినందుకే అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని ప్రధాన మంత్రి అబీ అహ్మద్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 

మొదటగా ప్రభుత్వం తరపున ఆర్డర్‌ను తిరిగి అమలు చేయాల్సిందిగా ఫెడరల్ అధికారుల సాయం కోరామని అయినా కూడా ఘర్షణలను నియంత్రించడం కష్టతరం కావడంతో ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చిందని ప్రధాన మంత్రి అబీ అహ్మద్ కార్యాలయం ప్రకటించింది.  

ఎమర్జన్సీ అమల్లో ఉండగా బహిరంగ సభలను నిషేధం.. అలాగే ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారెంట్లు లేకుండా అరెస్టులు జరుగుతాయని ఏ ప్రకటనలో పేర్కొంది. అవసరాన్ని బట్టి కర్ఫ్యూ విధించదానికి కూడా వెనుకాడమని ప్రకటనలో తెలిపింది.  

ఇది కూడా చదవండి: రష్యా యుద్ధనౌకపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి..

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)