Breaking News

అమెరికా ప్రభుత్వ చెల్లింపుల వ్యవస్థలోకి మస్క్‌ బృందం 

Published on Mon, 02/03/2025 - 04:32

వాషింగ్టన్‌: సామాజిక భద్రత మొదలు ఆరోగ్య సంరక్షణ దాకా అమెరికా ప్రభుత్వ ఖజానా నుంచి జరిగే ప్రతి నగదు చెల్లింపుపై సమీక్ష జరిపే అధికారం ప్రపంచ కుబేరుడు, నూతన ప్రభుత్వ దక్షత (ఎఫీషియన్సీ) శాఖ అధినేత ఎలాన్‌ మస్క్‌ కు దఖలుపడింది. ఈ మేరకు ట్రెజరీ పేమెంట్‌ సిస్టమ్స్‌పై యాక్సెస్‌ చేసే సదుపాయం మస్క్‌ బృందానికి కల్పించారు. 

దీంతో ఏ మంత్రిత్వశాఖకు, సంస్థకు, ప్రభుత్వ కాంట్రాక్టర్‌కు, ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు ఎంతెంత మొత్తాలు అమెరికా ప్రభుత్వ ఖాజానా నుంచి చెల్లిస్తున్నారో అంతా మస్క్‌ కు తెలియనుంది. ఈ వివరాలను న్యూయార్క్‌ టైమ్స్‌ తాజా కథనంలో ప్రచురించింది. ‘‘ అత్యంత రహస్యమైన ప్రభుత్వ చెల్లింపుల విధానం డేటా మొత్తం మస్క్‌ బృందం చేతిలో పెట్టడం సముచితంకాదు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన చెల్లింపులనూ ఈ బృందం ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టే ప్రమాదముంది. 

రాజకీయ దురుద్దేశంతో, అనవసర జోక్యంతో చెల్లింపులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపొద్దు. ఏదైనా సంస్థ లేదంటే లబ్ధిదారులకు చెల్లింపులు అర్థంతరంగా ఆగిపోతే ఆ ప్రభావం నేరుగా దేశంపై, దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది  ’’ అని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌కు రాసిన లేఖలో సెనేటర్‌ రాన్‌ వైడెన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్థిక శాఖ తాత్కాలిక ఉప మంత్రిగా చేసిన ప్రభుత్వ అధికారి డేవిడ్‌ లెబ్‌రిక్‌ రాజీనామా చేసిన రోజునే ఈ లేఖ వెలుగులోకి రావడం గమనార్హం. అత్యంత సున్నితమైన డేటాను యాక్సెస్‌ చేసే అవకాశం కోసం మస్క్‌ బృందం ఒత్తిడి వల్లే డేవిడ్‌ రాజీనామా చేసినట్లు శుక్రవారం వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనంలో పేర్కొంది.
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)