Breaking News

స్పేస్‌ ఎక్స్‌తో ఇస్రో తొలి ప్రయోగం సక్సెస్‌

Published on Tue, 11/19/2024 - 06:54

అమెరికా అంతరిక్ష పరిశోధనల ప్రైవేట్‌ కంపెనీ స్పేస్‌ఎక్స్‌తో.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయ్యింది. అత్యంత అధునాతన భారీ సమాచార ఉపగ్రహం జీశాట్‌20 (GSAT N2) అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.

అమెరికాలోని ఫ్లోరిడా కేప్‌ కెనావెరల్‌ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. సుమారు 34 నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు. అనంతరం హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని స్పేస్‌ ఎక్స్‌ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు.. ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించిన ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌.. బృందానికి అభినందనలు తెలియజేశారు. 

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి GSAT-20

స్పేస్‌ఎక్స్‌ ఎలాన్‌ మస్క్‌కు చెందిన కంపెనీ అనేది తెలిసిందే. వాణిజ్య పరంగా ఇస్రో, స్పేస్‌ఎక్స్‌ మధ్య ఇదే తొలి ప్రయోగం. జీశాట్‌20 బరువు సుమారు 4,700 కేజీలు. ఇస్రోకు అందుబాటులో ఉన్న లాంఛ్‌ వెహికల్స్‌ అంత బరువును మోసుకెళ్లే సామర్థ్యం లేదు. అందుకే స్పేస్‌ ఎక్స్‌ ద్వారా ఇస్రో ప్రయోగించింది. ఆ కంపెనీకి చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ఈ జీశాట్‌20ను నింగిలోకి మోసుకెళ్లింది.

అడ్వాన్స్‌డ్‌ బ్యాండ్‌ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా ఇస్రో దీన్ని రూపొందించింది. జీశాట్‌ఎన్‌2 ఉపగ్రహం ద్వారా విమానాల్లో వైఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి.   అంతేకాదు.. భారత్‌లోని మారుమూలు ప్రాంతాలు, అండమాన్‌ నికోబార్, లక్షద్వీప్‌ వంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్‌ సేవలను అందించడమే ఈ ఉపగ్రహం లక్ష్యం. అంతేకాకుండా ఈ జీశాట్‌20 ఉపగ్రహం 14 ఏళ్ల పాటు సేవలు అందించనుంది.  

ఇదీ చదవండి: మన బాహుబలికి అంతబలం లేదంట!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)