Breaking News

ఎంతపని చేశావయ్యా ఎలన్‌ మస్క్‌?

Published on Tue, 07/25/2023 - 11:04

ఓవైపు ఎక్స్‌గా పేరు మార్చేసి మరీ ట్విటర్‌ను #TwitterX అతలాకుతలం చేసేసిన ప్రపంచ అపరకుబేరుడు ఎలన్‌ మస్క్‌.. ఏకంగా ఎక్స్‌ వీడియోస్‌ అనే బూతు హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తెచ్చేశాడు. ఈలోపు ఆయనగారికే చెందిన మరో X కంపెనీ చేసిన నిర్వాకం వెలుగు చూసింది. 

ఎలన్‌ మస్క్‌ ప్రైవేట్‌ స్పేస్‌ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కి చెందిన ఫాల్కన్‌ రాకెట్‌ .. అయనోస్పియర్‌కు పెద్ద రంధ్రం చేసేసిందట. వాతావరణంలో పైకి వెళ్లే కొద్దీ పొరలను ‘‘ట్రోపో, స్ట్రాటో, మీసో, థెర్మో(ఐనో), ఎక్సో, మాగ్నెటోస్పియర్‌లుగా విభజించబడిన సంగతి తెలిసిందే. అందులో అయానోస్పియర్‌కు జులై 19వ తేదీన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ప్రయోగం ద్వారా భారీగానే డ్యామేజ్‌ జరిగినట్లు తెలుస్తోంది. 

జులై 19వ తేదీన  కాలిఫోర్నియా వండెన్‌బర్గ్‌ స్పేస్‌ ఫోర్స్‌ బేస్‌ నుంచి ఫాల్కన్‌-9 రాకెట్‌ ప్రయోగం జరిగింది. ఈ క్రమంలో అయానోస్పియర్‌ పొరను రాకెట్‌ చీల్చేయడం స్పష్టంగా కనిపించిందని.. ఆ సమయంలో ఎర్రని రంగు వెలుతురు ఉద్భవించిందని బోస్టన్‌ యూనివర్సిటీకి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జెఫ్‌ బౌమ్‌గార్డెనర్‌ చెబుతున్నారు.    

► రాకెట్ల ఇంధనం మండించినప్పుడు ఇది సాధారణంగా జరిగేదే అయినా.. అత్యంత శక్తివంతమైన ఫాల్కన్‌ రాకెట్‌తో అయానోస్పియర్‌కు జరిగిన డ్యామేజ్‌ ఎక్కువేనని ఆయన అంటున్నారు. 

► అయానోస్పియర్‌.. మొత్తం అయాన్‌లతో ఆవరించబడి ఉంటుంది. సోలార్ ప్లాస్మా అయాన్లతో చర్య జరిపి ఆకాశంలో కనిపించే అద్భుతమైన రంగులను సృష్టించడానికి కారణం ఇదే. అంతేకాదు.. భూ అయస్కాంత తుఫానులకు అయానోస్పియరే కారణమని అమెరికా పరిశోధన సంస్థ నాసా చెబుతోంది. 

► వాతావరణ పొరల్లో అయానోస్పియర్ కూడా ముఖ్యమైనది.  ఎందుకంటే.. ఇది కమ్యూనికేషన్, నేవిగేషన్ కోసం ఉపయోగించే రేడియో తరంగాలను ప్రతిబింబించడం, మార్పు చేయడం లాంటివి చేస్తుంది. ఒకవేళ అయానోస్పియర్‌కు డ్యామేజ్‌ జరిగితే.. అది GPS, నేవిగేషన్‌ సిస్టమ్‌లపై ప్రభావం కచ్చితంగా చూపుతుంది. 

► ఇప్పటికిప్పుడు కాకపోయినా.. భవిష్యత్తులో శక్తివంతమైన రాకెట్ల ప్రయోగం వల్ల ఇది సంభవించి తీరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైగా ప్రైవేట్‌ కంపెనీతో అడ్డగోలు ప్రయోగాలు చేస్తున్న స్పేస్‌ఎక్స్‌ లాంటి కంపెనీలతో వాతావరణానికి పెను నష్టం తప్పదనే అభిప్రాయమూ చాలాకాలంగా వ్యక్తమవుతూ వస్తోంది. 

► గమనించదగ్గ విషయం ఏంటంటే.. అయానోస్పియర్‌కు స్పేస్‌ఎక్స్‌ రాకెట్లు నష్టం చేయడం ఇదే తొలిసారి కాదు. 2017 ఆగష్టు 24వ తేదీ జరిగిన ఫాల్కన్‌-9 రాకెట్‌ ప్రయోగం, అలాగే.. 2022 జూన్‌ 19వ తేదీన జరిగిన ప్రయోగంలోనూ ఇదే తరహాలో అయానోస్పియర్‌కు నష్టం వాటిల్లింది. 

► ఇదిగాక.. ఈ ఏడాది ఏప్రిల్‌ 20వ తేదీ స్పేస్‌ఎక్స్‌ చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద భారీ రాకెట్‌ ప్రయోగం(టెస్టింగ్‌ దశలో).. పేలిపోగా, టెక్సాస్‌ బేస్‌ వద్ద నష్టం భారీ స్థాయిలో జరిగింది. దుమ్మూధూలి ఎగసిపడి మైళ్ల దూరం వరకు పర్యావరణానికి నష్టం వాటిల్ల జేయడంతో పాటు అక్కడి జీవజాలంపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపెట్టింది. 

ఇదీ చదవండి: వాట్సాప్‌ స్టేటస్‌లతోనూ ప్రమాదమే!
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)