Breaking News

డోజ్‌కు త్వరలో మస్క్‌ గుడ్‌బై? 

Published on Mon, 03/31/2025 - 06:12

వాషింగ్టన్‌: అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్‌) సారథ్య పదవికి ఎలాన్‌ మస్క్‌ రాజీనామా చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని మస్క్‌ స్వయంగా వెల్లడించారు. ఫాక్స్‌ న్యూస్‌ వార్తాసంస్థకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావిస్తూ డోజ్‌కు వీడ్కోలు పలకబోతున్న అంశాన్ని కూడా పేర్కొన్నారు. ఆయన ఇప్పటికే డోజ్‌ బృందంలోని కీలకమైన ఏడుగురు సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై సంస్థ తదుపరి కార్యాచరణపై చర్చించారు. 

ఆరామ్‌ మొఘాద్దాషీ, స్టీవ్‌ డేవిడ్, బ్రాడ్‌ స్మిత్, ఆంటోనీ ఆర్మ్‌స్ట్రాంగ్, జోయీ గిబ్బియా, టోమ్‌ క్రాస్, టైలర్‌ హసేన్‌లతో మస్క్‌ సమావేశమయ్యారు. వివాదాస్పద నిర్ణయాలతో వరసబెట్టి కార్యనిర్వాహక ఉత్తర్వులిస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌కు కుడిభుజంగా వేలమంది కేంద్ర ప్రభుత్వోద్యోగులను మస్క్‌ సాగనంపడం, వేలకోట్ల విలువైన ప్రభుత్వ ఒప్పందాలు, కాంట్రాక్టులను రద్దుచేయడం తెలిసిందే. దాంతో ఆయన తప్పుకున్నాక డోజ్‌ విభాగం ఉంటుందా, ఉంటే నూతన సారథి ఎవరంటూ చర్చ మొదలైంది. 

సొంత సమస్యలను పరిష్కరించుకునేందుకే మస్క్‌ ఇలా హడావుడిగా డోజ్‌ నుంచి వైదొలగుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆయన టెస్లా కంపెనీ కార్ల పనితీరు, సంస్థలో శ్వేతజాతీయేతర ఉద్యోగుల పట్ల వివక్ష, భాగస్వాముల విభేదాలు, వినియోగదారుల ఫిర్యాదుల వంటి సమస్యలతో మస్క్‌ సతమతమవుతున్నారు. ట్రంప్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని దాదాపు చేరుకున్నాకే డోజ్‌ నుంచి నిష్క్రమించబోతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘అమెరికా ఆర్థిక భారాన్ని కనీసం ట్రిలియన్‌ డాలర్ల మేర తగ్గించాలన్న లక్ష్యం దాదాపు సాధించాం’’అని చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)