Breaking News

పనిగంటలపై మస్క్‌ సంచలన ట్వీట్‌

Published on Sun, 02/02/2025 - 18:47

వాషింగ్టన్‌:ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి పనిగంటల పెంపు వ్యాఖ్యల వివాదం అమెరికాను తాకింది. అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రముఖ బిలియనీర్‌ ఇలాన్‌మస్క్‌ ఈ విషయంలో నారాయణమూర్తి కంటే చాలా అడుగులు ముందుకు వేశారు. తాను తన డీవోజీఈ డిపార్ట్‌మెంట్‌ సిబ్బంది ఏకంగా వారానికి 120 గంటలు పనిచేస్తున్నామని చెప్పారు.

ఇదే సమయంలో అమెరికా ఉన్నతస్థాయి అధికారులు వారానికి కేవలం 40 గంటలు మాత్రమే పనిచేస్తున్నారని అందుకే పౌరులు చెల్లిస్తున్న పన్ను సొమ్ము వృథా అవుతోందని మస్క్‌ తెలిపారు. ఈ మేరకు మస్క్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో ఒక పోస్టు చేశారు. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థపై డీవోజీఈ చేస్తున్న ఆడిట్‌లో సంచలన విషయాలు బయట పడుతున్నాయని, ప్రజల డబ్బు ఎలా దుర్వినియోగమవుతోందో తెలుస్తోందని మస్క్‌ అన్నారు. 

 అయితే డీవోజీఈ ఆడిట్‌లపై ఉద్యోగుల సంఘాలు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ రాజకీయ దురుద్దేశాలతో చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా బ్యూరోక్రసీని సమర్థవంతంగా తయారుచేసేందుకు ట్రంప్‌ డీవోజీఈ చీఫ్‌గా మస్క్‌ను నియమించిన విషయం తెలిసిందే. 

కాగా, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తితో పాటు ఎల్‌అండ్‌టీ చీఫ్‌ సుబ్రమణియన్‌ తదితరులు ఎక్కువ పనిగంటల విధానమే మేలని వ్యాఖ్యానించి వివాదానికి కారణమయ్యారు. అయితే భారత ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఆర్థిక సర్వే మాత్రం 60 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని పేర్కొనడం గమనార్హం. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)