పాప్‌కార్న్‌ రోబోలు వచ్చేస్తున్నాయ్‌

Published on Mon, 07/21/2025 - 04:45

లాస్‌ ఏంజెలెస్‌: వేడివేడి పాప్‌కార్న్‌ కావాలంటే చెఫ్‌కే చెప్పనక్కర్లేదు. తమ హ్యూమనాయిడ్‌ రోబోట్‌కు చెప్పినా చకచకా చేసి ఇచ్చేస్తుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ చెప్పారు. తమ ‘టెస్లా’ సంస్థ అభివృద్ధిచేస్తున్న హ్యూమనాయిడ్‌ రోబో త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని మస్క్‌ ప్రకటించారు. లాస్‌ఏంజెలెస్‌ నగరంలోని ప్రఖ్యాత హాలీవుడ్‌ ప్రాంతంలో టెస్లా కొత్తగా ‘డిన్నర్, సూపర్‌చార్జర్‌’ అనే రెస్టారెంట్, చార్జింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటుచేస్తోంది. ఇందులో ఆప్టిమస్‌ పేరిట ఒక రోబోట్‌ను అందుబాటులోకి తేనున్నారు.

ఇది పోప్‌కార్న్‌ను ఎప్పటికప్పుడు తాజాగా తయారుచేసి అతిధులు, వినియోగదారులకు అందిస్తుంది. సంబంధిత వీడియోను మస్క్‌ తన ‘ఎక్స్‌’ఖాతాలో పోస్ట్‌చేశారు. అడిగిందే తడవుగా కస్టమర్‌కు కవర్‌లో పాప్‌కార్న్‌ను సర్వ్‌చేయడం, ప్రతిగా ధన్యవాదాలు తెలిపిన కస్టమర్‌కు రోబోట్‌ చేయి ఊపుతూ అభివాదంచేయడం ఆ వీడియోలో ఉంది. ‘‘ ఈరోజు ఇంటర్నెట్‌లో చూడదగ్గ వీడియో ఉందంటే అది ఇదే. కస్టమర్‌కు ఆప్టిమస్‌ ఎంత చక్కగా, పద్ధతిగా, మర్యాదగా సర్వ్‌ చేస్తోందో చూడండి. ఇదంతా త్వరలో సర్వసాధారణ విషయంగా మారబోతోంది’’ అని మస్క్‌ ‘ఎక్స్‌’లో క్యాప్షన్‌ పెట్టారు.

హాలీవుడ్‌లోని శాంటామోనికా బోల్వార్డ్‌ ప్రాంతంలో ఈ అధునాతన డిన్నర్, సూపర్‌చార్జర్‌ రెస్టారెంట్, చార్జింగ్‌ స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. ‘‘ భవిష్యత్తులో ఈ రోబోలు మన దైనందిన జీవిత పనులన్నీ చేస్తూ మనకు సాయంగా ఉంటాయి. మనం కూర్చున్న చోటుకే వచ్చి మనకు కూల్‌డ్రింక్స్‌ అందిస్తాయి. పెంపుడు శునకాన్ని అలా బయట వాకింగ్‌కు తీసుకెళ్తాయి. పిల్లలను ఆడిస్తాయి’’ అని గతేడాది అక్టోబర్‌లో జరిగిన రోబోల సంబంధ ‘మనం’ కార్యక్రమంలో మస్క్‌ వ్యాఖ్యానించారు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)