Breaking News

ఇజ్రాయెల్‌లో ఐసెన్‌కోట్‌ సర్కార్‌! 

Published on Fri, 11/06/2026 - 05:55

జెరూసలేం: ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ నెసెట్‌ ఎన్నికల ఫలితాల్లో అస్పష్టతకు త్వరలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఫలితాల్లో కింగ్‌ మేకర్లుగా అవతరించిన అరబ్‌ పార్టీలు ఐసెన్‌కోట్‌కు మద్దతు ప్రకటించాయి. గురువారం అధ్యక్షుడు ఇసాక్‌ హెర్జోగ్‌తో జరిపిన చర్చల సందర్బంగా అరబ్‌ పార్టీలు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ముందుంచాయి. 

అక్టోబర్‌ 27వ తేదీన జరిగిన ఎన్నికల్లో 120 మంది సభ్యులుండే నెసెట్‌లో ప్రధాని నెతన్యాహూ కూటమికి 53 సీట్లు రాగా, ఐసెన్‌కోట్‌ వర్గానికి 48 సీట్లు దక్కాయి. నెసెట్‌లో మెజారిటీకి 61 సీట్లు అవసరం. దీంతో, ఈ దఫా రికార్డు స్థాయిలో 19 సీట్లు గెలుచుకున్న అరబ్‌ పార్టీల కూటమి మద్దతు కీలకంగా మారింది. ఇదే సమయంలో, తాము ఎవరికీ మద్దతివ్వబోమని నెతన్యాహూకు మిత్ర పక్షం యునైటెడ్‌ తోరాహ్‌ జుడాయిజం(యూటీజే)ప్రకటించడంతో ఆయనకు దారులు పూర్తిగా మూసుకుపోయినట్లయింది. ఈ సమయంలో, తాము నెతన్యాహూ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి రాకుండా చేయాలన్న లక్ష్యంతోనే ఐసెన్‌కోట్‌కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నామని అరబ్‌ పార్టీల కూటమి ‘జాయింట్‌ లిస్ట్‌’లోని రామ్‌ పార్టీ నేత మన్సూర్‌ అబ్బాస్‌ చెప్పారు. జాయింట్‌ లిస్ట్‌ ప్రకటనతో ఐసెన్‌కోట్‌కు 67 మంది సభ్యుల మద్దతు లభిస్తుంది. 

రెండు దేశాల విధానానికి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గాజా శాంతి ప్రణాళికకు తాము కట్టుబడి ఉంటామని అబ్బాస్‌ చెప్పారు. ప్రస్తుత నెతన్యాహూ ప్రభుత్వంలో అరబ్బులు వివక్షను, జాతి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని, ఈ విషయంలో తాము మార్పును కోరుకుంటున్నామని జాయింట్‌ లిస్ట్‌ చైర్మన్‌ యూసెఫ్‌ జబరీన్‌ వివరించారు. అదే సమయంలో, అరబ్బులపై వివక్ష సహా అనేక అంశాల్లో ఐసెన్‌కోట్‌తో తమకు అనేక అంశాల్లో విభేదాలు ఉన్న విషయమై వాస్తవమేనని ఆయన వ్యాఖ్యానించారు. ‘మంచి, చెడు మధ్య ఏది ఎంచుకోవాలన్న అవకాశం మాకు లేదు. మాకు ఉన్నదల్లా చెడు, అంతకుమించిన చెడు మధ్య ఎంపిక చేసుకునే అవకాశం మాత్రమే’అంటూ జబరీన్‌ వ్యాఖ్యానించారు. జాయింట్‌ లిస్ట్‌ బయటి నుంచి ఐసెన్‌కోట్‌ సారథ్యంలోని మైనారిటీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందని మరో అరబ్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ టిబి చెప్పారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)