Breaking News

పాపం.. బతికిందని సంతోషించేలోపే గుండె ఆగింది

Published on Mon, 06/19/2023 - 10:28

ఒంట్లో ఓపికలేకున్నా.. బలానంతా కూడదీసుకుని, తానింకా బతికే ఉన్నానని శవపేటిక మూతను తట్టిమరీ కొన ఊపిరితో బయటపడిన బామ్మ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. అయితే.. బతికిందని సంతోషించేలోపే.. అదీ వారంలోపే ఆమె ఉదంతం విషాదాంతం అయ్యింది. 

ఈక్వెడార్‌ బామ్మ బెల్లా మోంటోయా(76) కార్డియాక్‌ అరెస్ట్‌తో కన్నుమూసినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ఆస్పత్రిలో ఉన్నంత సేపు ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తూనే ఉన్నామని, వారం తర్వాత(జూన్‌ 16న) ఆమె మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఇక తల్లి మృతిపై గిల్బర్ట్‌ బార్బెరా స్పందిస్తూ.. తన తల్లి శాశ్వత నిద్రలోకి జారుకున్నట్లు ప్రకటించాడు. 

చనిపోయిందనుకుని భావించి జూన్‌ 9వ తేదీన శవపేటికలో ఉంచి సమాధి చేయబోతుండగా.. శవపేటికను బాది ఆమె ప్రాణాలతో బయపడి అందరినీ ఆశ్చర్యపర్చింది. సుమారు ఐదు గంటలపాటు ఆ బామ్మ శవపేటికలోనే ఉండిపోయింది. శ్వాస అందకపోవడంతో ఇబ్బంది పడిన ఆమెను అప్పటికప్పుడే ఆంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

catalepsy(కండరాలు బిగుసుకుపోవడం) వల్ల ఆమె స్పృహ కోల్పోయి కదల్లేని స్థితిలో అచేతనంగా ఉండిపోయిందని, అలా ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు భావించి ఉంటారని ఆ టైంలో వైద్య నిపుణులు పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలో చికిత్స పొందుతూ.. వారం తర్వాత గుండెపోటు రావడంతో కన్నుమూసిందామె. ఏ స్మశానవాటికలో ఆమె బతికిందని సంతోషించారామె.. అదే చోట ఆమెను మళ్లీ ఇప్పుడు సమాధి చేశారు.

Video Credits: Associated Press

ఇదీ చదవండి: రక్తం కారుతున్నా లెక్క చేయకుండా..

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)