Breaking News

నేపాల్‌లో భూకంపం.. భయంతో వణికిపోయిన ప్రజలు

Published on Fri, 02/28/2025 - 07:15

ఖాట్మాండు: హిమాలయ దేశం నేపాల్‌లో భూమి కంపించింది. సింధుపల్‌చోక్‌ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టార్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

వివరాల ప్రకారం.. నేపాల్‌లోని సింధుపల్‌చోక్ జిల్లాలోని భైరవకుండ వద్ద భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అక్కడే భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే, రిక్టార్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదు అయినట్టు చెప్పుకొచ్చారు. భూకంపం కారణంగా ప్రాణనష్టమేమీ జరగలేదని తెలిపారు. భూమి కంపించడంతో ఇళ్లలోని ప్రజలందరూ బయటకు పరుగులు తీశారు. ఇక, భారత్‌, చైనా, టిబెట్‌ సరిహద్దుల్లో కూడా స్వల్పంగా భూమి కంపించినట్టు అధికారులు చెబుతున్నారు. 

కాగా, నేపాల్‌ భూకంపం ప్రభావం మన దేశంలోని పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపించింది. బీహార్‌ రాజధాని పాట్నాతో పాటు పశ్చిమబెంగాల్‌, సిక్కిం రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొన్నిచోట్ల ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)