Breaking News

ఎయిర్ ట్యాక్సీ సర్వీసు ప్రారంభం త్వరలోనే..

Published on Sun, 01/18/2026 - 23:07

దుబాయ్: రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికే ఎయిర్ ట్యాక్సీ సేవను ఈ ఏడాది చివరి నాటికి దుబాయ్‌లో ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రోడ్డు మార్గంలో 45 నిమిషాలు పట్టే ప్రయాణాలు, ఫ్లయింగ్ ట్యాక్సీ ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే పూర్తవుతాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పామ్ జుమేరాకు 10 నిమిషాల్లో చేరుకోవచ్చు.

ఈ ట్యాక్సీ సర్వీస్‌ పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులకు దుబాయ్‌  నగరంలో వేగవంతమైన, సులభమైన ప్రయాణ సౌకర్యాన్ని అందించనుంది. అమెరికాకు చెందిన జోబీ ఏవియేషన్ సంస్థ రూపొందించిన జోబీ ఎస్-4 ఎలక్ట్రిక్ విమానాన్ని ఈ సర్వీస్‌లో ఉపయోగించనున్నారు. పైలట్‌తో కలిపి మొత్తం ఐదుగురు ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. ఇది గంటకు సుమారు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

మొదటి దశలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, డౌన్‌టౌన్ దుబాయ్, దుబాయ్ మెరీనా, పామ్ జుమేరాలోని అట్లాంటిస్ ది రాయల్ హోటల్ సమీప ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టీఏ) చైర్మన్ మత్తర్ అల్ తయర్ తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు చెప్పారు.

పూర్తిగా విద్యుత్తుతో నడిచే ఎయిర్ ట్యాక్సీలు కావడంతో శబ్ద, పర్యావరణ కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది. ప్రయాణికులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఎయిర్ ట్యాక్సీలను బుక్ చేసుకోవచ్చు. దుబాయ్ ప్రజా రవాణా నెట్‌వర్క్‌తో ఈ సేవలను అనుసంధానించే ప్రణాళికలు కూడా ఉన్నాయి. అయితే ఎయిర్‌ ట్యాక్సీ ఛార్జీలు ఎలా ఉంటాయన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)