Breaking News

దుబాయ్‌ ‍క్రౌన్‌ ప్రిన్స్‌ లైఫ్‌ స్టయిల్‌ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..

Published on Tue, 04/08/2025 - 14:58

న్యూఢిల్లీ: ఆయన రూ. 33,500 కోట్లకు అధిపతి.. వ్యక్తిగత ఐలాండ్‌, రూ. 100 కోట్లకుపైగా విలువైన కార్లు ఆయన సొంతం.. ఆయన మరెవరో కాదు.. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్. ఆయన నేడు (మంగళవారం) తన రెండు రోజుల పర్యటన సందర్భంగా భారత్‌కు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన ఆయన పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు.

రూ. 33,500 కోట్ల విలువైన ఆస్తి కలిగిన ఆయన విలాసవంతమైన జీవనశైలి, వ్యక్తిగత అభిరుచులు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ఏప్రిల్  8న ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై, పలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. ఏప్రిల్ 9న ముంబైలో జరిగే వ్యాపారవేత్తల సమావేశంలో పాల్గొని, అక్కడి నుంచి ఆయన తిరిగి దుబాయ్‌ వెళ్లనున్నారు.

షేక్ హమ్దాన్ ఆస్తి వివరాలు
షేక్ హమ్దాన్ వ్యక్తిగత సంపద సుమారు 4 బిలియన్ డాలర్లు (రూ. 33,500 కోట్లు) ఇది ఆయన కుటుంబ ఆస్తిలో భాగంగా కాకుండా వ్యక్తిగత పెట్టుబడులు, వ్యాపారాల నుండి ఆర్జించినది.

రియల్ ఎస్టేట్ 
ఆయనకు దుబాయ్‌లోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో  అత్యంత ఖరీదైన ఆస్తులు ఉన్నాయి. జాబీల్ ప్యాలెస్, బుర్జ్ ఖలీఫా సమీపంలోని ఆధునిక రెసిడెన్షియల్ యూనిట్లు ఉన్నాయి.

ప్రైవేట్ ఐలాండ్
షేక్ హమ్దాన్‌కు పర్షియన్ గల్ఫ్‌లోని ఒక ప్రైవేట్ ద్వీపం ఉంది. దీని పేరు సిర్ బానీ యాస్‌. దీనిని ఆయన విశ్రాంతి తీసుకునేందుకు, సాహస క్రీడలకు వినియోగిస్తారు.

ఖరీదైన వాహనాలు 
ఆయన వద్ద రూ. 100 కోట్లకు పైగా విలువైన లగ్జరీ కార్ల కలెక్షన్‌ ఉంది. ఇందులో బుగాటీ వెయిరాన్, లంబోర్ఘిని వెనెనో, మెర్సిడెస్-బెంజ్ ఎస్‌ఎల్‌ఆర్ లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.

ప్రైవేట్ జెట్‌లు
షేక్ హమ్దాన్‌ వద్ద బోయింగ్ 747-400, ఎయిర్‌బస్ ఏ320 లాంటి అత్యాధునిక ప్రైవేట్ జెట్‌లు ఉన్నాయి. వీటిని ఆయన అధికారిక, వ్యక్తిగత పర్యటనల కోసం  వినియోగిస్తుంటారు.

యాచ్‌లు(చిన్న నౌకలు) 
దుబాయ్‌ ‍క్రౌన్‌ ప్రిన్స్‌ వద్ద దుబాయ్ అనే సూపర్ యాచ్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యాచ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. దీని విలువ సుమారు రూ. 4000 కోట్లు.

పెంపుడు జంతువులు 
ఆయన వద్ద అరుదైన తెల్ల పులులు, సింహాలు, ఒంటెలు, గుర్రాలు ఉన్నాయి. ఈ జంతువులను ఆయన దుబాయ్‌లోని తన ప్రత్యేక ఫామ్‌హౌస్‌లో పెంచుతారు.

సాహస క్రీడలు
షేక్ హమ్దాన్.. స్కైడైవింగ్, రాక్ క్లైంబింగ్, హార్స్ రైడింగ్, ఫాల్కన్రీలపై అమితమైన ఆసక్తి కనబరుస్తారు. వీటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ఆయన షేర్‌ చేస్తుంటారు.

వ్యక్తిగత జీవితం
షేక్ హమ్దాన్ 1982, నవంబర్ 14న దుబాయ్‌లో జన్మించారు. తొలుత ఆయన యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్‌హర్స్ట్‌లో శిక్షణ పొందారు. తరువాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డిగ్రీ పొందారు. 2008లో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్‌గా  ఎన్నికయ్యారు. యూఏఈ ఉప ప్రధాని, రక్షణ మంత్రిగానూ పనిచేస్తున్నారు.

సోషల్ మీడియా 
‘ఫజ్జా’ పేరుతో సోషల్ మీడియాలో ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీనిలో ఆయన తాను రాసిన కవితలు, తన జీవనశైలి, సాహస యాత్రలను షేర్‌ చేస్తుంటారు. 

ఇది కూడా చదవండి: ‘భయపడొద్దు.. ఇన్‌కంట్యాక్స్‌ వాళ్లేమీ రారు’: ‍ప్రధాని మోదీ

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)