Breaking News

హమ్మయ్యా.. ఊపిరి పీల్చుకున్న జపాన్‌

Published on Sat, 07/05/2025 - 21:28

క్యాలెండర్‌లో తేదీ మారింది.  ఎట్టకేలకు జపాన్‌ ఊపిరి పీల్చుకుంది. ఏదో విపత్తు ముంచేస్తోందని ‘జపాన్‌ బాబా వాంగా’ ర్యో తత్సుకి చెప్పిన కాలజ్ఞానం ఉత్తదేనని తేలిపోయింది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా జపాన్‌ డూమ్స్‌ డే.. చివరకు హుళక్కే అని తేలింది. 

జులై 5, 2025న మెగా సునామీ జపాన్‌ను ముంచెత్తబోతోందన్న ప్రచారం.. ఉత్తి ఉత్కంఠగానే తేలిపోయింది. భారీ భూకంపంగానీ.. సునామీగానీ సంభవించలేదు. కొన్ని స్వల్ప ప్రకంపనలు, అగ్నిపర్వతం బద్దలు మినహా ఓ మోస్తరు ప్రకృతి వైపరిత్యాలు సంభవించలేదు. తేదీ మారినా.. ఏం జరగకపోవడంతో ఆ దేశ ప్రజలు హమ్మయ్యా.. అనుకుంటున్నారు. 

1999లో ప్రచురించబడిన ఓ మాంగా (The Future I Saw) రచయిత ర్యో తత్సుకి.. జులై 5వ తేదీన విపరీతమైన భూకంపం, యుగాంతం తరహాలో సునామీ ముంచెత్తవచ్చని తన చిత్రాలతో బొమ్మలు గీసింది. 

మీడియాతో పాటు సోషల్‌మీడియాలోనూ జపాన్‌ డూమ్స్‌ డే అంటూ హడావిడి నడిచింది. #JapanTsunami, #July5, #TheFutureISaw వంటివి ట్రెండింగ్ అయ్యాయి. కొంతమంది పర్యాటకులు పర్యటనలు రద్దు చేసుకున్నారు. అందులో భారత్‌ నుంచి కూడా చాలామంది ఉన్నారు. జపాన్ లోని ఆకుసెకిజిమా వాసులను అప్రమత్తంగా తరలించాల్సి వచ్చింది.

అయితే.. మేధావులు, సైంటిస్టులు.. ఆ భవిష్యవాణి నిరాధారమైనదిగా చెబుతూనే వస్తున్నారు. మరోవైపు అక్కడి వాతావరణ విభాగం కూడా.. భూకంపాలను అంచనా వేయలేమని మొత్తుకుంటూ వచ్చింది. చివరకు అదే నిజమని తేలింది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)