Breaking News

South Carolina Primary: హాలేపై ట్రంప్‌ ఘన విజయం

Published on Sun, 02/25/2024 - 09:16

కొలంబియా: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరిగిన కీలకమైన సౌత్‌ కరోలినా రిపబ్లికన్‌ ప్రైమరీలోనూ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దూసుకుపోయారు. ప్రత్యర్థి నిక్కీ హాలేపై ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలో ట్రంప్‌నకు 63 శాతం ఓట్లు రాగా హాలేకు 36.8 ఓట్లు మాత్రమే వచ్చాయి. హాలేకు ఇది అవమానకరమైన ఓటమిగా అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది.

రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష పదవి నామినేషన్‌కు పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన హాలే గతంలో సౌత్‌ కరోలినా గవర్నర్‌గా రెండుసార్లు పనిచేశారు. హాలేకు సౌత్‌ కరోలినా కంచుకోటగా విశ్లేషకులు చెప్తారు. ఇక్కడ కూడా ట్రంప్‌ ఘన విజయం సాధించడంతో రిపబ్లిక్‌ పార్టీ అధ్యక్ష పదవి పోటీకి ట్రంప్‌ అభ్యర్థిత్వం ఖాయమైపోయినట్లేనన్న ప్రచారం జరుగుతోంది.

రిపబ్లికన్‌ పార్టీ ప్రస్తుతం చాలా ఐక్యంగా ఉందని సౌత్‌ కరోలినా ప్రైమరీ పోలింగ్‌ ముగిసిన తర్వాత సౌత్‌ కరోలినా రాజధాని కొలంబియాలో ట్రంప్‌ వ్యాఖ్యానించారు. సౌత్‌ కరోలినాలో ఓటమి తర్వాత రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి  పోటీ నుంచి నిక్కీ హాలే తప్పుకోవాలని ట్రంప్‌ వర్గం డిమాండ్‌ చేస్తోంది. అయితే తాను రేస్‌ నుంచి తప్పుకోనని హాలే ప్రకటించారు.

మార్చి5 మంగళవారం(సూపర్‌ ట్యూస్‌డే)నాడు జరిగే పలు స్టేట్‌ ప్రైమరీ ఎన్నికల్లో పోటీలో ఉంటానని తేల్చి చెప్పారు.  కాగా, ట్రంప్‌ ఇప్పటివరకు 5 ప్రైమరీల్లో విజయం సాధించి రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఎవరూ అందుకోలేనంత ముందంజలోకి వెళ్లారు. ప్రైమరీలు ముగిసిన తర్వాత ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అటు డెమొక్రాట్ల ప్రైమరీల్లో ప్రస్తుత దేశ అధ్యక్షకుడు జో బైడెన్‌ రేసులో ముందున్నారు.  

ఇదీ చదవండి.. న్యూయార్క్‌ అపార్ట్‌మెంట్‌లో మంటలు.. భారత యువకుడి మృతి 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)