Breaking News

‘మాజీ అధ్యక్షుణ్ణి అవమానిస్తారా?’.. బ్రెజిల్‌కు ట్రంప్‌ సుంకాల షాక్‌

Published on Thu, 07/10/2025 - 07:39

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు మద్దతు పలుకుతూ, ఆ దేశానికి 50 శాతం భారీ సుంకాన్ని ప్రకటించారు.  బోల్సోనారోపై కొనసాగుతున్న అవినీతి కేసుపై విమర్శలు గుప్పించారు. ఇది అంతర్జాతీయ అవమానంగా అభివర్ణించారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాకు ట్రంప్‌ రాసిన లేఖలో ఈ కేసును కొనసాగించవద్దని కోరారు. బ్రెజిల్ వాణిజ్య విధానాలపై వాషింగ్టన్ దర్యాప్తు ప్రారంభిస్తుందని హెచ్చరించారు. భారత్‌ మాదిరిగానే బ్రెజిల్ ‘బ్రిక్స్’ భాగస్వామ్య దేశం.

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో తనకు బాగా తెలుసని, ఆయనతో కలిసి తాను పనిచేశానని ట్రంప్ పేర్కొన్నారు.  ఆయన పదవీకాలంలో ప్రపంచ నేతలు ఆయనను ఎంతో గౌరవంగా చూశారని ట్రంప్ పేర్కొన్నారు. అయితే అతని విషయంలో ప్రస్తుతం బ్రెజిల్ అనుసరిస్తున్న విధానం అవమానకరమని ట్రంప్ ఆ లేఖలో పేర్కొన్నారు. బోల్సోనారో తిరుగుబాటు కేసుపై ట్రంప్ గతంలో చేసిన విమర్శలపై బ్రెజిల్ ఇటీవల ఘాటుగా స్పందించిన దరిమిలా ట్రంప్ భారీ సుంకాలతో బ్రెజిల్‌కు షాకిచ్చారు.

బ్రెజిల్‌ ప్రస్తుత అధ్యక్షుడు లూలా నుంచి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బోల్సోనారో కుట్ర పన్నారనే ఆరోపణలున్నాయి. అయితే సైన్యం నుంచి ఆయనకు మద్దతు అందకపోవడంతో ఆ కుట్ర విఫలమైందని చెబుతారు. అయితే బోల్సోనారో ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. కాగా ఆగస్టు ఒకటి నుంచి బ్రెజిలియన్ వస్తువులపై 50 శాతం అమెరికా సుంకం అమల్లోకి వస్తుందని, ఇతర ఆర్థిక వ్యవస్థల గడువుకు ఇది సమానమని ట్రంప్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.  ట్రంప్ ప్రస్తుతం తమ దేశ వాణిజ్య భాగస్వాములకు లేఖలు జారీ చేస్తున్నారు. అధిక సుంకాల జాబితాలో గతంలో బ్రెజిల్ లేదు.

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)