EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి
Breaking News
ప్రభుత్వ పథకాలు పొందే వాళ్లకు నో గ్రీన్‌కార్డ్
Published on Fri, 07/17/2026 - 05:01
మయామి: విదేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వాళ్లలో ఆర్థికంగా నిలదొక్కుకున్న వాళ్లకే గ్రీన్‌కార్డ్‌లను జారీ చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. మనుగడ కోసం ప్రభుత్వంపై ఆధారపడే వలసదారులకు గ్రీన్‌కార్డ్ ఇవ్వడంలో అర్థంలేదని ట్రంప్ సర్కార్ ఓ నిర్ణయానికొచ్చింది. ఇకపై ఫుడ్ స్టాంప్‌లు, మెడిక్ఎయిడ్, హౌసింగ్ ఓచర్లు, ఇతరత్రా ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందే వలసదారులకు గ్రీన్కార్డ్ల జారీపై పునరాలోచన చేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. సంబంధిత ‘పబ్లిక్ చార్జ్’విధాన నిర్ణయం తాలూకు వివరాలను గురువారం అమెరికా తన ఫెడరల్ రిజిస్టర్లో కని్పంచాయి.
ఈ నిబంధనలను జూలై 20వ తేదీన ప్రచురించే ఆస్కారముంది. వాస్తవానికి ఈ నిబంధనను ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు 2020 ఫిబ్రవరిలో అమలుచేశారు. తాము ప్రభుత్వానికి ఏరకంగానూ భారంగా మారబోమని, ప్రభుత్వ పథకాల నుంచి లబ్దిపొందట్లేమని హామీ ఇచ్చిన వాళ్లను గ్రీన్‌కార్డ్ ఆశావహుల జాబితాలో పరిశీలించేవాళ్లు. కానీ తర్వాతి అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్ గెలిచాక డెమొక్రటిక్ ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించింది. తాజాగా ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టాక ఈ పాత నిబంధనను మళ్లీ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
Tags : 1