Breaking News

అధ్యక్ష ఎన్నికల వేళ.. ఇజ్రాయెల్‌కు ట్రంప్‌ మాస్‌ వార్నింగ్‌!

Published on Thu, 10/31/2024 - 19:09

వాషింగ్టన్‌: గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా గాజాలో మారణహోమం జరుగుతోంది. వందల, వేల సంఖ్యలో ప్రజల బలైపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. తాను అమెరికా ఎన్నికల్లో గెలిచి వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టే నాటికి గాజాలో యుద్ధం ముగియాలని హెచ్చరికలు జారీ చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ట్రంప్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను అమెరికా ఎన్నికల్లో గెలిచి వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టే నాటికి గాజాలో యుద్ధం ముగియాలని నెతన్యాహును కోరారు. వీలైనంత త్వరగా ముగింపు పలకాలని కోరారు. ప్రజా సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఇక, గతంలోనూ గాజాలో యుద్ధం ముగింపు గురించి నెతన్యాహుకు ట్రంప్‌ ప్రతిపాదించారు.  ఇటీవల కూడా ఆయన నెతన్యాహుతో ఈ విషయం గురించి మరోసారి చర్చించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. నవంబర్‌ ఐదో తేదీన అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కమలా హారీస్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వీరిద్దరూ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధంపై ‍ట్రంప్‌ ఇలాంటి కామెంట్స్‌ చేశారనే చర్చ నడుస్తోంది. ఇక, ఇజ్రాయెల్‌ విషయంలో కమలా హారీస్‌ కూడా సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే. 

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)