Breaking News

తనని తాను ‘రాజు’గా ప్రకటించుకున్న ట్రంప్‌!

Published on Thu, 02/20/2025 - 21:37

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనని తాను రాజుగా ప్రకటించుకోవడం కలకలం రేపుతోంది. ట్రంప్‌ తాజాగా, న్యూయార్క్‌ నగరంలోని  పాత బస్సు, మెట్రో రవాణా వ్యవస్థకు నిధులు సమకూర్చే కాంక్షన్ ప్రైసింగ్ ప్రోగ్రామ్ (Congestion Pricing Program)ను రద్దు చేశారు. రద్దు అనంతరం, ట్రూత్ సోషల్‌లో ట్రంప్ తనను తాను ‘రాజు’ అని ప్రకటించుకున్నారు. దీంతో  ఆయన అధ్యక్షాధికారాలపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మరింత వివాదం
వైట్ హౌస్ అధికారిక ఎక్స్‌ అకౌంట్‌లో ట్రంప్‌ రాజు ప్రకటనను మరింతగా హైలైట్ చేస్తూ, టైమ్ మ్యాగజైన్ మేకప్‌ కవర్‌ను షేర్‌ చేసింది. అందులో లాంగ్‌ లైవ్‌ ద కింగ్‌ అనే క్యాప్షన్‌ జోడించడం గమనార్హం. అంతేకాదు, వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ టేలర్ బుడోవిచ్ ఏఐ-తయారుచేసిన ట్రంప్ రాజరిక చిత్రం పోస్ట్ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. 


న్యూయార్క్ గవర్నర్ వార్నింగ్‌ 
ట్రంప్ రాజు ప్రకటనపై న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ తీవ్రంగా స్పందించారు. మేం రాజుల పాలనలో లేం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. కోర్టులో కలుసుకుందాం’ అంటూ ఘాటుగా స్పందించారు.

అధ్యక్ష అధికార దుర్వినియోగమా?  
ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది. మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (MTA) ట్రాన్స్‌పోర్టేషన్ సెక్రటరీ షాన్ డఫీ, ఇతర ఫెడరల్ అధికారులపై కేసు నమోదు చేసింది. ట్రంప్ ప్రభుత్వం న్యూయార్క్ ట్రాన్స్‌పోర్ట్ టోల్ ప్రోగ్రామ్ రద్దు చేయాలని ప్రయత్నించడం అధికార దుర్వినియోగం, రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాలను నాశనం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు