Breaking News

ఐవీఎఫ్‌ తండ్రిని నేను: డొనాల్డ్‌ ట్రంప్‌

Published on Thu, 10/17/2024 - 05:48

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ పడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ మరో వివాదానికి తెరతీశారు. కృత్రిమ గర్భధారణ(ఐవీఎఫ్‌)కు తాను తండ్రి లాంటివాడినని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే ఐవీఎఫ్‌(ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌)ను ఉచితం చేస్తానని ప్రకటించారు. తాజాగా జార్జియాలో ఫాక్స్‌ న్యూస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కృత్రిమ గర్భధారణకు తమ పార్టీ పూర్తి అనుకూలమని స్పష్టంచేశారు. ఈ విషయంలో డెమొక్రటిక్‌ పార్టీ నేతలు తమపై మాటల దాడి చేస్తారని తెలిసినప్పటికీ ఐవీఎఫ్‌కు మద్దతు ఇస్తూనే ఉంటామని అన్నారు. 

కొన్ని రాష్ట్రాల్లో గర్భవిచ్చిత్తి చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని, వాటిని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. అబార్షన్‌ హక్కులను రాష్ట్రాలకే వదిలేయాలన్నది తన విధానమని స్పష్టంచేశారు. అత్యాచారం వల్ల గర్భం దాలిస్తే, గర్భం దాలి్చన తల్లి ప్రాణానికి ముప్పు ఉంటే గర్భవిచ్చిత్తికి అనుమతి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. అయితే, ఉచిత ఐవీఎఫ్‌ పథకానికి నిధులు ఎలా సమకూరుస్తారో ట్రంప్‌ వెల్లడించలేదు. అలాగే చట్టపరమైన ఇబ్బందులను ఎలా ఎదుర్కొంటారని తెలియజేయలేదు. ఐవీఎఫ్‌ తండ్రిని అంటూ ట్రంప్‌ చేసిన ప్రకటనను ట్రంప్‌ ప్రత్యర్థి, డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ తప్పుపట్టారు.    

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)