Breaking News

డొనాల్డ్‌ ట్రంప్‌కు బిగ్ షాక్.. లైంగిక వేధింపుల కేసులో రూ.41 కోట్ల జరిమానా

Published on Wed, 05/10/2023 - 09:04

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ రచయిత్రిని ఆయన లైంగికంగా వేధించాడని న్యూయార్క్ జ్యూరీ తేల్చింది. ఆమెకు పరిహారంగా 5 మిలియన్ డాలర్లు(రూ.41 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. దీంతో 2024 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలనుకుంటున్న ట్రంప్‌కు పెద్ద షాక్ తగిలినట్లయింది.

1996లో మాన్‍హటన్ అవెన్యూలోని లగ్జరీ బర్జ్‌డార్ఫ్ గుడ్‌మ్యాన్ స్టోర్‌లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ప్రముఖ రచయిత్రి ఇ. జీన్‌ కారెల్‌ ఆరోపించారు. ఆపై తనను లైంగికంగా వేధించాడని తెలిపారు. 2019లో ఓసారి తన గురించి అసభ్యంగా మాట్లాడి ప్రతిష్ఠకు భంగం కలిగించారని పరువునష్టం పిటిషన్ దాఖలు  చేశారు. ట్రంప్‌పై భయంతోనే తాను 20 ఏళ్లకుపైగా ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడలేకపోయానని చెప్పారు.

ఈ ఆరోపణలపై విచారణ జరిపిన జ్యూరీ ట్రంప్‌ను దోషిగా తేల్చింది. అయితే ట్రంప్‌పై చేసిన అత్యాచారం ఆరోపణల్లో మాత్రం వాస్తవం లేదని చెప్పింది. కానీ జీన్ కారోల్ చేసిన ఇతర ఆరోపణలు నిజమేనని తేల్చింది. దీంతో ఆమెకు పరిహారంగా రూ.41 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.

ట్రంప్ తీవ్ర విమర్శలు..
కాగా.. ఈ తీర్పుపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ తీర్పు అవమానకరంగా ఉందని మండిపడ్డారు. ఇది తను ఎప్పటికీ వెంటాడుతుందని అన్నారు.  లైంగిక ఆరోపణలు చేసిన రచయిత్రి అసలు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఈమేరకు తన 'ట్రూత్ సోషల్' ఖాతా వేదికగా తెలిపారు.
చదవండి: అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు