డొనాల్డ్‌ ట్రంప్‌ అనుచిత వ్యాఖ్యలు

Published on Wed, 04/09/2025 - 13:57

వాషింగ్టన్‌: సుంకాల దెబ్బకు విలవిలలాడుతున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తనతో సంప్రదింపులు జరిపేందుకు కొన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని.. ఈ క్రమంలో ఎంతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నాయంటూ  తీవ్ర పదజాలం ఉపయోగించారాయన.

నేషనల్‌ రిపబ్లికన్‌ కాంగ్రెసెషనల్‌ కమిటీలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ఏరకంగా చూసుకున్నా పార్లమెంట్‌(Congress) కంటే నేనే మెరుగైన మధ్యవర్తిని. అందుకే ఆయా దేశాలు నాకే ఫోన్లు చేస్తున్నాయి. సుంకాల విషయంలో ఊరట కోసం బతిమాలుకుంటున్నాయి.(ఈ క్రమంలోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు). ప్లీజ్‌ సర్‌.. మాతో ఒప్పందం చేసుకోండి అంటూ వేడుకుంటున్నాయి. ఏమైనా చేస్తామంటూ దిగజారిపోతున్నాయి’’ అని వ్యాఖ్యానించారాయన. అలాగే..

సుంకాల దేశాలతో ఒప్పందం కోసం పార్లమెంట్‌ను అనుమతించాలని కొందరు రిపబ్లికన్‌ పార్టీలో కొందరు రెబల్‌ నేతలు కోరుతున్నారు. అదే జరిగి ఉంటే.. చైనా మీద ఇవాళ 104 శాతం సుంకాలు విధించాల్సి వచ్చేది కాదు. చైనా ఎంతో సంతోషంగా ఉండి ఉండేది. పైగా అమెరికానే సుంకాలు చెల్లించాల్సి వచ్చేది. పైగా మన దేశాన్ని అమ్ముకోవాల్సి వచ్చేది. కాబట్టి మధ్యవర్తిత్వంలో చట్టసభ సమర్థవంతంగా పని చేస్తుందని నేను అనుకోను. ఇక్కడ ఒక విషయం చెప్పదల్చుకున్నా.. నాలా మీరెవరూ మధ్యవర్తిత్వం వహించలేరు’’ అని ట్రంప్‌ వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి: ఫార్మా రంగం.. భారత్‌కు ట్రంప్‌ బిగ్‌ షాక్‌

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)