Breaking News

Donald Trump: ‘అణు యుద్ధాన్ని ఆపాను’: భారత్‌- పాక్‌లపై అదే మధ్యవర్తిత్వ వాదన

Published on Tue, 07/15/2025 - 08:23

వాషింగ్టన్‌ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మరోమారు భారత్‌- పాక్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహించానని వాదించారు. తన చొరవతో రెండు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు సాగిన ఘర్షణను ఆపానని పేర్కొన్నారు. ‘యుద్ధాలను పరిష్కరించడంలో మేము విజయవంతం అయ్యాం. ఈ జాబితాలో భారత్‌- పాకిస్తాన్ ఉన్నాయి. ఇవి నాడు మరో వారంలోనే అణు యుద్ధనికి దిగేవి, అది చాలా ఘోరంగా జరిగివుండేది. దానిని మేము ఆపాం’ అని ట్రంప్ పేర్కొన్నారు.
 

వాణిజ్యాన్ని పరపతిగా ఉపయోగించుకుని, తన వ్యూహాన్ని అమలు చేశానని.. సంఘర్షణను పరిష్కరించే వరకు  మీతో వాణిజ్యం గురించి మాట్లాడబోమని చెప్పడంతో భారత్‌- పాక్‌ మధ్య యుద్ధం ముగిసిందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.  ఇదేవిధంగా ట్రంప్‌ గత జూన్‌లో విలేకరులతో మాట్లాడుతూ భారత్‌- పాకిస్తాన్‌ మధ్య తలెత్తబోయే అణు యుద్ధాన్ని పరిష్కరించానని  పేర్కొన్నారు. తాను పాకిస్తాన్‌, భారత్‌లతో మాట్లాడానని, అక్కడి నేతలు అణ్వాయుధాలతో దాడి చేసుకోగలిగే సమర్థత కలిగినవారని ట్రంప్‌ పేర్కొన్నారు.

అయితే అమెరికా అధ్యక్షుడు చేసిన వాదనలను భారతదేశం ఇంతకుముందే తోసిపుచ్చింది. ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పటి నుండి కాల్పుల విరమణ, సైనిక చర్యపై అవగాహన కుదిరే వరకు భారత్‌- అమెరికా నేతల మధ్య సంభాషణలు జరిగాయని, దేనిలోనూ ఇటువంటి మధ్యవర్తిత్వ ప్రస్తావన లేదని భారత్‌ స్పష్టం చేసింది.  పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్‌ మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)