Breaking News

ట్రంప్‌.. చైనాతో దోస్తీనా? కుస్తీనా?.. ఐదు పాయింట్లలో స్పష్టం

Published on Wed, 01/22/2025 - 07:35

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడైన తర్వాత చైనా విషయంలో ఆయన వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలోని ఈ రెండు  శక్తిమంతమైన దేశాల మధ్య సంబంధాల్లో ఇప్పటికే ఉద్రిక్తతలున్నాయి. అయితే వాషింగ్టన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే ఈ రెండు దేశాలు పరస్పర చర్చలపై ఎంతో ఆసక్తి చూపించాయి. భవిష్యత్తులో అమెరికా-చైనా మధ్య సంబంధాలలో సానుకూల మార్పును సూచించే ఐదు పరిణామాలు ఇవేనంటూ విశ్లేషకులు చెబుతున్నారు.

1. ఇటీవల ట్రంప్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అమెరికా-చైనా సంబంధాలలో ‘కొత్త ప్రారంభ స్థానం’ కోసం పిలుపునిచ్చారు. ఇరుదేశాల ‘విస్తృత ఉమ్మడి ప్రయోజనాలను’ ప్రస్తావించారు.

2. ఈ సంభాషణలో టిక్‌టాక్‌పై కూడా చర్చ జరిగిందని ట్రంప్ అన్నారు. నిజానికి అమెరికా టిక్‌టాక్‌ను నిషేధించడానికి సిద్ధమయ్యింది. అయితే ట్రంప్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే టిక్‌టాక్‌ ప్లాట్‌ఫామ్‌పై నిషేధాన్ని 75 రోజుల పాటు వాయిదా వేశారు.

4. జీ జిన్‌పింగ్.. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌ను పంపారు. అమెరికా అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవానికి బీజింగ్‌ నుంచి పంపిన అత్యంత సీనియర్ అధికారి హాన్ జెంగ్‌.

5. ట్రంప్ వైట్ హౌస్‌లో తన మొదటి రోజు (జనవరి 20)ప్రకటనల్లో చైనా వస్తువులపై సుంకాల విషయాన్ని ప్రస్తావించలేదు. మొదటి రోజే ఆయన దీనిని ప్రకటిస్తారని చాలా మంది పరిశీలకులు భావించారు. కానీ  అలా జరగలేదు.

పన్నుల గురించి మీడియా ట్రంప్‌ను అడిగినప్పుడు తన మునుపటి అధ్యక్షుని కాలంలో విధించిన పన్నులు ఇప్పటికీ అమలులో ఉన్నాయని అన్నారు. మెక్సికన్, కెనడియన్ వస్తువులపై సుంకాలు ఫిబ్రవరి ఒకటి నుండి అమల్లోకి వస్తాయని చెప్పారు. టిక్‌టాక్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం మంచి విషయమే అవుతుందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Delhi Elections-2025: 12 ఎస్సీ సీట్లు.. విజయానికి కీలకం

Videos

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు