Breaking News

యూఎస్‌ పౌరులను చంపిన వలసదారులకు మరణ శిక్ష: ట్రంప్‌

Published on Sat, 10/12/2024 - 10:13

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో.. అభ్యర్థులైన అటు కమలా హారిస్‌, ఇటు డొనాల్డ్‌ ట్రంప్‌ పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడంతోపాటు దేశ పౌరులకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచేందుకు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికాలోని అక్రమ వలసదారులపై విరుచుకుపడ్డారు. వలసదారులను ప్రమాదకరమైన నేరస్థులుగా అభివర్ణించారు. అమెరికా పౌరులను చంపిన వలసదారులకు మరణశిక్ష విధించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కొలరాడోలోని ఆరోరాలో నిర్వహించిన ప్రచార సభలో ట్రంప్‌ వలసదారులపై ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.

తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే వెనిజులా గ్యాంగ్‌ ట్రెన్‌ డీ అరాగ్వాకు చెందిన ముఠా సభ్యులను లక్ష్యంగా చేసుకొని ‘ఆపరేషన్‌ అరోరా’ ప్రారంభిస్తానని చెప్పారు.. ఇమ్మిగ్రేషన్‌ వ్యతిరేక పాలసీని ప్రస్తావిస్తూ.. చట్టవిరుద్దమైన వలసదారుల చొరబాటు పౌరులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నారని తెలిపారు. దీనిని త్వరలోనే పరిష్కరిస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు.

‘మన దేశాన్ని ప్రమాదకరమైన నేరస్థులు ఆక్రమించుకున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అమెరికాను ఆక్రమిత అమెరికా అని పిలుస్తున్నారు. నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే వలసదారులే లక్ష్యంగా నేషనల్‌ ఆపరేషన్‌ అరోరాను ప్రారంభిస్తా. దీంతో నవంబరు 5న అమెరికా విముక్తి దినోత్సవంగా మారుతుంది. అమెరికన్‌ పౌరుడిని, చట్టబద్ధంగా ఉన్న అధికారులను చంపిన వలసదారులకు మరణశిక్ష విధించే బిల్లును తెస్తాం. 

వెనెజువెలా గ్యాంగ్‌ను ఏరిపారేయడానికి ఆరోరాపై దృష్టిసారిస్తా. అరోరాను, దాడి చేసి స్వాధీనం చేసుకున్న ప్రతీ పట్టణాన్ని నేను రక్షిస్తా. ఈ క్రూరమైన నేరస్థులను జైలులో పెడతాం. వారిని దేశం నుంచి తరిమేస్తాం’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇక, యూఎస్‌ ప్రభుత్వం దక్షిణ సరిహద్దు నియంత్రణకు మెక్సికోతో పలు సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈనేపథ్యంలో ఆ ప్రాంతంలో వలసదారుల చొరబాటు పెరిగిపోతుందని ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు.

అంతేగాక మహిళలు, పిల్లల అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తులతో సహా ఇతర నేరస్థులకు మరణశిక్షను పొడిగించాలని ట్రంప్ ఇప్పటికే ప్రతిపాదించారు. ఇక వచ్చే నెల 5వ తేదీని అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థిగా కమలాహారిస్‌లు బరిలో ఉన్నారు.

 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)