Breaking News

కమలా హారిస్‌తో డిబెట్‌కు ట్రంప్‌ ఓకే.. ఎప్పుడంటే..!

Published on Sat, 08/03/2024 - 12:55

అమెరికా అద్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీకి దిగుతున్న వైఎస్‌ ప్రెసిడెంట్‌ కమలా హ్యారిస్‌తో టీవీ చర్చలో పాల్గొనేందుకు రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్‌ ట్రంప్‌ అంగీకారం తెలిపారు. సెప్టెంబర్‌ 4న హారిస్‌తో కలిసి ఫాక్స్‌ న్యూస్‌ డిబెట్‌లో పాల్గొననున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించారు.

కాగా కమలా హారిస్‌,ట్రంప్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే గత జూన్‌లో ట్రంప్‌, జోబైడెన్‌ అధ్యక్ష చర్చలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చ‌ర్చ‌లో బైడెన్ సరిగా మాట్లాడలేకపోయారని విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్‌ మాటలకు సమాధానలు చెప్పడంలో విఫలమైనట్లు, తడబడినట్లు విశ్లేషకులు భావించారు. దీంతో ఆయన్ను అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డెమొక్రాట్ల నుంచి ఒత్తిడి వచ్చింది. అనుకున్నట్లుగానే చివరికి బైడెన్‌ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు.

ఇక  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్‌ అభ్యర్థిత్వం ఖరారైన అనంతరం ట్రంప్‌ నుంచి ఈ ప్రకటన వెలువడింది. శుక్రవారం డెమోక్రటిక్ పార్టీ డెలిగేట్ల ఆన్‌లైన్‌ పోలింగ్‌ మొదలైన నేపథ్యంలో ఆమె మెజారిటీ ఓట్లను గెల్చుకున్నారు. దాంతో అభ్యర్థిత్వం ఖరారైంది. ఇదిలా ఉండగా నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు