Breaking News

భారత సంతతి కుటుంబం మృతి కేసులో కీలక అంశాలు

Published on Mon, 01/01/2024 - 15:32

న్యూయార్క్: అమెరికాలోని మసాచుసెట్స్‌లో భారత సంతతి సంపన్న కుటుంబం చనిపోయిన కేసులో పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్ కమల్ (57), ఆయన భార్య టీనా(54) కుమార్తె అరియానా(18) వారి విశాలమైన భవనంలో శవాలై కనిపించారు. రాకేష్ మృతదేహం దగ్గర తుపాకీ ఉండటంతో గృహ హింసలో వీరు మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. 

రాకేష్ కమల్ తన భార్య టీనా, కూతురు అరియానాతో మసాచుసెట్స్‌లో విశాలమైన భవనంలో నివసిస్తున్నారు. ఆ భవనంలో 11 పడక గదులు, 13 బాత్‌రూమ్‌లు ఉన్నాయి. అయితే.. వీరు గత రెండు రోజులుగా కనిపించకోవడంతో సమీప బంధువు వెళ్లి చూశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాకేష్ కుటుంబం మొత్తం మృతదేహాలుగా పడి ఉన్నారు. రాకేష్ మృతదేహం వద్ద ఆయన తుపాకీ కూడా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే.. రాకేష్ కుటుంబం ఆర్థిక సమస్యలతో మరణించి ఉండవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి. టీనా, ఆమె భర్త గతంలో ఎడునోవా అనే ఎడ్యుకేషన్ కంపెనీని నడిపారు. వారి కంపెనీ 2016లో ప్రారంభించబడింది. కానీ డిసెంబర్ 2021లో కాలేజీని రద్దు చేశారని పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో భవనంలో కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. 

అరియానా తెలివైన యువతి..
రాకేష్, టీనా కుమార్తె అరియానా మిల్టన్ అకాడమీ నుండి పట్టభద్రురాలైంది. ఆమె మరణం గురించి తెలుసుకోవడం చాలా బాధ కలిగించిందని అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. అరియానా చాలా తెలివైన అమ్మాయి అని విద్యాలయ ఫ్రొఫెసర్ పేర్కొన్నారు.   

ఇదీ చదవండి: బాంబు దాడిలో.. జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్ అజహార్ మృతి?

Videos

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావ్ లోకేష్ ఇక నీ చాప్టర్ క్లోజ్..

అన్నాచెల్లెళ్ల టీచర్ జాబ్.. బయటపడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

DSC అక్రమాల పుట్ట గుట్టురట్ట

అతి దారుణంగా కారణం ఇదేన బస్సు స్టాండ్ లో..! పోలీస్ మార్క్ ట్రీట్ మెంట్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)