Breaking News

పిరమిడ్‌పై పక్షుల వేట

Published on Mon, 10/21/2024 - 06:27

వీధి శునకాలు ఆహారం కోసం ఊరంతా తిరుగుతాయి. కానీ ఒక వీధికుక్క ఏకంగా ఈజిప్ట్‌ పిరమిడ్‌నే ఎక్కేసింది. మార్షల్‌ మోషెర్‌ అనే అమెరికా పారా గ్లైడర్‌ ఈ ఉదంతాన్ని తన మొబైల్‌ కెమెరాలో బంధించాడు. ఆయన ఇటీవల తోటి పారాగ్లైడర్లతో కలిసి ప్రపంచ ప్రఖ్యాత గిజా పిరమిడ్ల మీదుగా సూర్యోదయ అందాలను చూసేందుకు బయల్దేరాడు. వినీలాకాశంలో చక్కర్లు కొడుతుండగా ఖఫ్రే పిరమిడ్‌ శిఖరంపై ఒక జీవి కనిపించింది. 

తొలుత దాన్ని పర్వత ప్రాంతాల్లో తిరిగే బుల్లి సింహంగా భావించారు. కానీ మొబైల్‌ కెమెరాను జూమ్‌ చేసి చూస్తే సాధారణ వీధి కుక్క అని అర్థమైంది. ప్రపంచంలోనే రెండో అత్యంత ఎత్తయిన పిరమిడ్‌పై అదేం చేస్తోందబ్బా అని పరిశీలిసతఏ, పిరమిడ్‌ శిఖరాగ్రంపై వాలే పిట్టలను పట్టుకునేందుకు పరుగులు పెడుతూ కని్పంచింది. వీధి కుక్కులు ఇలా 130 మీటర్లకు పై చిలుకు ఎత్తుకు ఎక్కిరావడం అరుదు. దారి తప్పి వచి్చందేమో, కిందకు ఎలా వెళ్లాలో తెలీక పైనే తచ్చాడుతోందేమో అని వారు భావించారు. మర్నాడు దాన్ని కిందకు దించాలని నిర్ణయించుకున్నారు. 

అది పిరమిడ్‌పై తిరుగుతున్న వీడియోను మోషెర్‌ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేస్తే రాత్రికి రాత్రే కోట్ల మంది చూశారు. తీరా మర్నాడు వెళ్లి చూస్తే కుక్క పిరమిడ్‌పై లేదు! ఒక శునకం పిరమిడ్‌ పై నుంచి తాపీగా కిందకు దిగొస్తున్న వీడియోను మరో సాహస యాత్రికుడు తర్వాతి రోజే నెట్‌లో షేర్‌చేశాడు. దాంతో అదే ఇదని నిర్ధారణకు వచ్చారు. ఈ వీడియో చూసిన కొందరు ఈజిప్షియన్లు మాత్రం శునకాన్ని ఏదో అతీంద్రీయ శక్తి పైకి తీసుకెళ్లిందని కామెంట్లు చేశారు. ఈజిప్ట్‌ పురాణాల ప్రకారం ఆ ప్రాంతంలో అనూబిస్‌ అనే దైవం ఉండేది. మనిషి శరీరం, నక్క ముఖంతో ఉండే ఆ దేవున్ని శుభాలకు ప్రతిరూపంగా భావిస్తారు.                          

– కైరో  

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు