Breaking News

Zambia: 400 కుక్కలు మృతి.. ‍ప్రభుత్వం అప్రమత్తం

Published on Thu, 08/22/2024 - 13:18

ఆఫ్రికా దేశమైన జాంబియాలో విషాదకర ఉదంతం చోటుచేసుకుంది. కలుషితమైన మొక్కజొన్న పిండిని తిన్న 400కు పైగా పెంపుడు కుక్కలు మృతి చెందాయి. జాబియా దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ  ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. మొక్కజొన్న పిండి వినియోగించే విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు.

నెల రోజుల వ్యవధిలో భారీ సంఖ్యలో కుక్కలు చనిపోవడంతో ఆరోగ్య శాఖ విచారణ ప్రారంభించింది.  ఆ కుక్కలు తిన్న మొక్కజొన్న పిండికి సంబంధించిన 25 నమూనాలలో ప్రమాదకరమైన ఫంగస్ ఉనికిని గుర్తించారు. ఈ ఫంగస్ అఫ్లాటాక్సిన్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుందని, ఇది మానవులకు, జంతువులకు ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య మంత్రి ఎలిజా ముచిమా మాట్లాడుతూ జాంబియాలోని ప్రజలకు మొక్కజొన్న ప్రధాన ఆహారం. అందుకే ఇది ఆందోళనకరంగా మారిందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం అఫ్లాటాక్సిన్ అనేది కాలేయ క్యాన్సర్‌కు కారణమయ్యే విష పదార్థం.

జాంబియా ఆరోగ్య శాఖ తాజాగా కలుషితమైన మొక్కజొన్న పంటను గుర్తించి, దానిని నాశనం చేస్తోంది. దేశ జనాభాలో 60 శాతం మందికి మొక్కజొన్న ప్రధాన ఆహారం. ఇటీవలి కాలంలో తీవ్రమైన కరువు  ఏర్పడి మొక్కజొన్న పంటను దెబ్బతీయగా, ఇప్పుడు ఈ ఫంగస్  మరో ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది.

#

Tags : 1

Videos

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!