Breaking News

స్కిన్‌ క్యాన్సర్‌ నుంచి విజయవంతంగా బయటపడ్డ బైడెన్‌..ఇక ఎలాంటి..

Published on Sat, 03/04/2023 - 08:48

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి ఛాతిపై ఉండే శరీరంపై గాయం ఏర్పడింది. అది క్రమంగా క్యాన్సర్‌ మారింది. దీంతో ఫిబ్రవరిలో వైద్యలు బైడెన్‌ చికిత్స అందించి ఆ క్యాన్సర్‌ కణజాలన్ని విజయవంతంగా తొలగించారు. తదుపరి ఇక ఎలాంటి చికిత్స అవసరం లేదని వైట్‌హౌస్‌ వైద్యుడు కెవిన్‌ ఓ కానర్‌ ఓ లేఖలో తెలిపారు. దీన్ని బేసల్‌ సెల్‌ కార్సినోమా అనే చర్మ క్యాన్సర్‌కి సంబంధించిన సాధారణ రూపం అని పేర్కొన్నారు. బైడెన్‌ ఆరోగ్య సంరక్షణలో భాగంగా చర్మసంబంధమైన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నానని కూడా చెప్పారు.

గత నెల వైద్యులు జోబైడెన్‌(80) శారీర పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉ‍న్నారని ప్రకటించారు. ఆ సమయంలోనే అతని ఛాతీపై ఉన్న చర్మసంబంధ గాయాన్ని తొలగించి బయాప్సీకీ(ల్యాబ్‌ పరీక్షలకి) పంపినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే వైట్‌హౌస్‌ వైద్యుడు ఓ కానర్‌ లేఖలో ఆ విషయం గురించే చెప్పుకొచ్చారు. ల్యాబ్‌ పరీక్షల అనంతరం ఆ బేసల్‌ కార్సినోమా గాయాలు భవిష్యత్తులో వ్యాప్తి చెందే అవకాశం లేదని, ఇక ఏవిధమైన భయం అవసరం లేదని అన్నారు. ఇక ముందు ముందు దానికి సంబంధించి ఎలాంటి చికిత్స అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా, ఆయన 2024లో అధ్యక్ష రేస్‌లో దిగేందుకు సిద్ధమవుతున్నందున బైడెన​ ఆరోగ్యంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయన పోటీ చేయాలని యోచిస్తున్నట్లు ఆమెరికా ప్రధమ మహిళ జిల్‌ బైడెన్‌ కూడా చెప్పడం విశేషం.

(చదవండి: దారుణ అకృత్యానికి రెడీ అవుతున్న పుతిన్‌! ఏకంగా ఆత్మాహుతి దాడుల కోసం ప్లాన్‌)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)