Breaking News

రియల్‌ స్టోరీ చెప్పి.. గుండె గుభేల్‌మనిపించిన డాక్టర్‌

Published on Sat, 07/18/2026 - 19:28

తెల్లని శాలువా కప్పుకున్న వృద్ధురాలు తమ దగ్గరకు వచ్చిందని, ఆమె మనిషి కాదని ఓ డాక్టర్‌ చెప్పారు. ఆయన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌లోని ఓ ఆసుపత్రిలో తనకు ఎదురైన భయానక ఘటనను ఆ డాక్టర్ వివరించారు. ఆ ఘటన తనతో పాటు సిబ్బందినీ వణికించిందని తెలిపారు. అర్ధరాత్రి సమయంలో ఓ వృద్ధురాలు నర్సులతో కలిసి ఉన్న తన దగ్గరకు వచ్చిందని చెప్పారు. తనకు ఇటీవలే పుట్టిన మనవడిని పరీక్షించాలని ఆమె కోరినట్టు వివరించారు.

తన మనవడికి జ్వరం వచ్చిందని వృద్ధురాలు చెప్పడంతో డాక్టర్ వెంటనే ఆ గదికి వెళ్లాడు. శిశువును పరీక్షించగా, అప్పటికే అతడు శ్వాస తీసుకోవడం ఆపేశాడని గుర్తించారు. వెంటనే చికిత్స అందించడంతో ఆ చిన్నారి గుండె స్పందన మళ్లీ వచ్చిందని తెలిపారు.

ఆ ఘటన తర్వాత చిన్నారి తల్లిదండ్రులను డాక్టర్‌ పిలిచి, వారి బిడ్డ ప్రాణాలు కాపాడేలా చికిత్స కోసం తీసుకువచ్చిన అమ్మమ్మకు కృతజ్ఞతలు చెప్పాలని డాక్టర్ కోరారు. అప్పుడు ఆ అమ్మమ్మ ఎన్నో ఏళ్ల క్రితమే చనిపోయిందని వారు చెప్పడంతో డాక్టర్‌, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స‍్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఆసుపత్రుల్లో సాధారణమేనని చాలామంది అన్నారు. మరికొందరు తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను పంచుకున్నారు.

  • "ఒంటరిగానే స్వర్గానికి ప్రయాణం పూర్తి చేయాలని అమ్మమ్మకి తెలుసు. తన కుటుంబంలో ఇంకెవరూ తనతో రావద్దని ఆమె అనుకుంది. అందుకే ఆ శిశువును కాపాడింది" అని ఓ యూజర్ పేర్కొన్నారు.

  • "32 ఏళ్లుగా నర్సుగా పని చేస్తున్నాను. నేను చెప్పగలిగే ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. ఆత్మలు నిజంగానే ఉంటాయి. ఆసుపత్రులు అలాంటి అనుభవాలతో నిండి ఉంటాయి" అని మరో వ్యక్తి రాశారు.

  • ఆ డాక్టర్‌ అన్నీ అసత్యాలు చెబుతున్నారని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. 

 

#

Tags : 1

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)