Breaking News

జో బైడెన్‌కు పార్కిన్‌సన్స్‌.? క్లారిటీ ఇచ్చిన డాక్టర్‌

Published on Tue, 07/09/2024 - 09:39

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పార్కిన్‌సన్స్‌(వణుకు) వ్యాధి ఉందా.. వైట్‌హౌజ్‌కు న్యూరాలజీ డాక్టర్‌ పదే పదే ఎందుకు వస్తున్నాడు.. బైడెన్‌ పార్కిన్‌సన్స్‌ వ్యాధికి చికిత్స చేయడం కోసమేనా.. ఇలాంటి ప్రశ్నలు ఇటీవల అమెరికాలో చర్చనీయంశమయ్యాయి. 

ఈ నేపథ్యంలో జో బైడెన్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ కెవిన్‌ ఓ కానర్‌ ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. వైట్‌హౌజ్‌కు తరచుగా న్యూరాలజిస్ట్‌ రావడంపై సోమవారం(జులై 8) ఒక అధికారిక లేఖ విడుదల చేశారు. ‘అధ్యకక్షుడు బైడెన్‌కు పార్కిన్‌సన్స్‌ వ్యాధి లేదు. ఆయన ఈ వ్యాధి కోసం ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదు. 

వైట్‌హౌజ్‌లో ఉండే వందలాది మంది సిబ్బంది ఎదుర్కొనే న్యూరలాజికల్‌ సమస్యలకు చికిత్స చేయడానికి న్యూరాలజిస్ట్‌ ఇటీవల వైట్‌హౌజ్‌కు ఎక్కువగా వస్తున్నారు. కరోనా తర్వాత వైట్‌హౌజ్‌ సిబ్బందిలో న్యూరాలజీ సమస్యలు పెరిగాయి’అని లేఖలో తెలిపారు. 

కాగా, వృద్ధాప్యం రీత్యా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి బైడెన్‌ తప్పుకోవాలన్న డిమాండ్‌ ఇటీవల ఎక్కువయిన విషయం తెలిసిందే.  ఈ పరిస్థితుల్లో బైడెన్‌కు పార్కిన్‌సన్‌ లేదని ఆయన ఫిజీషియన్‌ క్లారిటీ ఇవ్వడం గమనార్హం. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. డెమొక్రాట్ల తరపున బైడెన్‌, రిపబ్లికన్ల  నుంచి ట్రంప్‌ ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)