Breaking News

Denmark: ఉత్తరాలపై డెన్మార్క్ కీలక నిర్ణయం.. కాల గర్భంలోకి 400 ఏళ్ల చరిత్ర!

Published on Wed, 12/31/2025 - 10:00

కోపెన్‌హాగన్: ఆధునిక డిజిటల్‌ యుగం ప్రపంచంలోని అన్నింటినీ సమూలంగా మార్చివేస్తోంది. ఈ ప్రభావం పోస్టల్‌ విభాగంపై తీవ్రంగా పడింది. సుమారు నాలుగు శతాబ్దాల కాలంగా ప్రజల మధ్య వారధిగా నిలిచిన డెన్మార్క్ పోస్టల్ సర్వీస్ తాజాగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలో భౌతిక రూపంలో ఉండే ఉత్తరాల పంపిణీని అధికారికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

దాదాపు 400 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ వ్యవస్థ, మారుతున్న కాలానికి అనుగుణంగా తన సేవలను సమూలంగా మార్చుకుంటోంది. ఉత్తరాల పంపిణీ కోసం దశాబ్దాలుగా  కొనసాగిన సార్వత్రిక సేవా బాధ్యత (Universal Service Obligation) ఒప్పందం ముగియడంతో డెన్మార్క్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.  ప్రజలు ఉత్తరాలు రాయడం తగ్గించడమే దీనికి ప్రధాన కారణం. గడచిన 20 ఏళ్లలో డెన్మార్క్‌లో ఉత్తరాల సంఖ్య ఏకంగా 90శాతానికి పడిపోయింది. స్మార్ట్‌ఫోన్లు, ఇమెయిల్స్‌, ఇతర డిజిటల్ సమాచార వ్యవస్థలు అందుబాటులోకి రావడంతో ప్రజలు కాగితంపై రాసే ఉత్తరాలకు దూరమయ్యారు.

ఒకప్పుడు వేల సంఖ్యలో పోస్ట్‌మెన్‌లు వీధివీధిన తిరిగిన రోజులు ఉండేవి. ప్రస్తుతం ఉత్తరాలు మోయడం అనేది పోస్టల్‌ విభాగానికి ఆర్థికంగా భారంగా మారింది. దీంతో ప్రభుత్వం పోస్టల్ సేవలను కేవలం పార్సిల్స్, వ్యాపార సరుకుల పంపిణీకే పరిమితం చేయాలని నిర్ణయించింది. మరోవైపు డిజిటల్ విప్లవంలో డెన్మార్క్ అగ్రగామిగా ఉంది. ఈ నిర్ణయంతో డెన్మార్క్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా డిజిటలైజ్ అవుతున్న దేశంగా మరోసారి నిరూపితమయ్యింది. ఇప్పటికే డెన్మార్క్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ప్రజల మధ్య కమ్యూనికేషన్ అనేది దాదాపు 100శాతం మేరకు డిజిటల్ వేదికల ద్వారానే సాగుతోంది.

అయితే డెన్మార్క్‌ పోస్టల్‌ విభాగం తీసుకున్న నిర్ణయం  వృద్ధులకు, సాంకేతికతపై అవగాహన లేని వారికి కొంతమేరకు ఇబ్బంది కలిగించేది ఉందని విశ్లేషకులు  అంటున్నారు. అంతేకాకుండా పోస్టల్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభావం పడనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే సంప్రదాయ రీతిలో ఉత్తరాల పంపిణీ ఆగిపోయినప్పటికీ, పార్సిల్, డెలివరీ రంగంలో తమ సేవలను మరింతగా మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే డెన్మార్క్‌ పోస్టల్‌ విభాగం వృద్ధుల కోసం ప్రత్యేక సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసి, వారికి డిజిటల్ వ్యవస్థపై అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నది.

ఇది కూడా చదవండి: దిక్కుతోచని ప్రయాణికులు.. విమానాల నుంచే ‘విషెస్’‌!

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)