Breaking News

గురుద్వారాల్లో తనిఖీలు.. ట్రంప్‌పై సిక్కుల ఆగ్రహం

Published on Mon, 01/27/2025 - 13:52

వాషింగ్టన్‌:ఎన్నికల ముందు చెప్పినట్టుగానే అమెరికా(America) అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసదారులను సాగనుంపుతున్నారు. ఈ క్రమంలో అక్రమ వలసదారులను అరెస్టు చేయడానికి ట్రంప్‌(Trump) అనుసరిస్తోన్న విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అక్రమ వలసదారుల్ని గుర్తించే క్రమంలో అధికారులు న్యూయార్క్‌,న్యూజెర్సీల్లోని గురుద్వారాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

తాము పవిత్రంగా భావించే ప్రార్ధనా మందిరాల్లో అక్రమ వలసదారుల కోసం హోం ల్యాండ్‌ సెక్యూరిటీ అధికారులు వెతకడంపై సిక్కు సంస్థలు మండిపడుతున్నాయి. గురుద్వారాల పవిత్రతను ట్రంప్‌ చర్య దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.కాగా, ట్రంప్‌ యంత్రాంగం అమెరికాలో ఇప్పటివరకు వందలమంది అక్రమ వలసదారులను అరెస్టు చేసింది. 

అరెస్టయిన వారంతా ఉగ్రవాదం,డ్రగ్స్‌,లైంగిక నేరాలు వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారేనని అధికారులు చెబుతున్నారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ(Deportation) ఆపరేషన్‌ చేపట్టారు.

ఇ‍ప్పటికే సైనిక విమానాల్లో వందల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించేశామని వైట్‌హౌస్ వెల్లడించింది.మరోవైపు,అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని,ఎందుకంటే అది పలురకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని ఇప్పటికే భారత్‌ స్పష్టం చేయడం గమనార్హం. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)