Breaking News

ద్వంద్వ పౌరసత్వం ఇవ్వండి..!

Published on Wed, 12/31/2025 - 19:14

అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించాలని అక్కడి ప్రవాసీ లీగల్ సెల్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ప్రవాసీ లీగల్ సెల్ ప్రతినిధులు బుధవారం యుఎస్, హూస్టన్‌లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయాన్ని సందర్శించారు. ప్రవాసీ లీగల్ సెల్ గ్లోబల్ ప్రతినిధి సుధీర్ తీరునిలత్‌ను కలిసి వినతి పత్రం అందించారు. ద్వంద్వ పౌరసత్వం కల్పించడానికి ఉన్న చట్టపరమైన అంశాలను పరిశీలిస్తామని ఆయన వారికి తెలిపారు

విదేశాల్లో ఉన్న భారతీయులకు తమ మాతృభూమితో సరైన సంబంధాలు ద్వంద్వ పౌరసత్వం ఇవ్వాలని గ్లోబల్ సెల్ ప్రతినిధులు సూచించారు. తద్వారా ప్రవాస భారతీయుల హక్కులను పరిరక్షించడమే కాకుండా భారత్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఎన్నారైలకు దంద్వ పౌరసత్వం కల్పించే అంశంపై ప్రవాసీ లీగల్ సెల్ తీవ్రంగా కృషి చేస్తోందని లీగల్ సెల్ హెచ్‌ఓసీ ప్రశాంత్ కుమార్ సోనా అన్నారు. కనుక అమెరికాలోని ఎన్నారైలు ఈ పోరాటంలో  భాగం పంచుకోవాలని కోరారు.

ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులకు భారత్ ఓసీఐ కార్టు అందజేస్తుంది. ఈ కార్డు ఉన్నవారు జీవిత కాలం పాటు భారత్‌లో పర్యటించవచ్చు. ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. కానీ ఓటు హక్కు, రాజకీయ పదవులు, ప్రభుత్వ ఉద్యోగాలకు వీరు అర్హులు కారు.   రాజ్యాంగం అమలు సమయం నుంచి భారత్ ఏక పౌరసత్వ విధానాన్ని అనుసరిస్తుంది. అయితే అమెరికా, కెనడా, యూకే లాంటి కొన్ని దేశాలు ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతిస్తాయి. 

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)