పడవలో కుళ్లిన 30 మృతదేహాలు.. సెనెగల్‌లో కలకలం

Published on Tue, 09/24/2024 - 10:53

డాకర్ (సెనెగల్): పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్‌లో ఒళ్లు జలదరించే దృశ్యం కనిపించింది. సెనెగల్ సాగర తీరంలో తేలియాడుతున్న పడవలో 30 కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలు లభ్యమయ్యాయి. రాజధాని డాకర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఈ పడవ కనిపించింది. నేవీ సిబ్బంది ఈ చెక్క పడవను ఓడరేవుకు చేర్చారు.

మృతదేహాలు కుళ్లిపోవడంతో వాటి గుర్తింపు కష్టంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. అయితే ఇవి ఎవరివనేది గుర్తించేందుకు ఉన్న మార్గాల గురించి అధికారులు అన్వేషిస్తున్నారు. ఇటీవలికాలంలో సెనెగల్ నుండి స్పెయిన్ కానరీ దీవులకు వలసలు భారీగా పెరిగాయి. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా 1,500 కిలోమీటర్లకు మించిన దూరాన్ని దాటి వలస సాగిస్తున్నారు.

ప్రాథమికంగా ఈ మృతదేహాలు వలసదారులవై ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. చాలా రోజులుగా అట్లాంటిక్ మహాసముద్రంలో  ఈ పడవ ఉండివుంటుందని అధికారులు చెబుతున్నారు. గత ఆగస్ట్‌లో డొమినికన్ రిపబ్లిక్ తీరంలో ఒక పడవలో 14 మృతదేహాలు లభ్యంకాగా, అవి సెనెగల్ జాతీయులవై ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. కాగా అక్రమ వలసలను అరికట్టడానికి సెనెగల్ 10 సంవత్సరాల ప్రణాళికను ప్రకటించింది. నిరుద్యోగం, పేదరికం, అంతర్గత సంఘర్షణలతో విసిగిపోయిన  యువకులు అట్లాంటిక్ మహాసముద్రంలో ఎదురయ్యే ముప్పును ఎదుర్కొంటూ కానరీ దీవులకు వలస వెళుతున్నారు. 

ఇది కూడా చదవండి: యూపీలో ఎన్‌కౌంటర్‌.. రూ. లక్ష రివార్డు నిందితుని హతం

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)