Breaking News

Bangladesh: షేక్‌ హసీనాపై హత్య కేసు!

Published on Tue, 08/13/2024 - 15:24

ఢాకా: బంగ్లాదేశ్‌ రిజర్వేషన్‌ కోటాకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో షేక్‌ హసీనా ప్రధానిగా రాజీనామా చేసి.. భారత్‌ చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్‌లో తాజాగా ఆమెపై హత్య కేసు నమోదైనట్లు స్థానిక మీడియా పేర్కొటోంది. 

రిజర్వేషన్ల విషయంలో షే​క్‌ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత నెలలో చెలరెగిన అల్లర్లలో ఓ కిరాణా షాప్‌ యజమాని హత్య చేయబడ్డారు. ఈ హత్య కేసులో షేక్‌  హసీనాతో సహా ఆరుగురిపై కేసు నమోదైనట్లు సమాచారం. ఈ కేసును.. అల్లర్లలో హత్య చేయబడ్డ కిరాణా ఓనర్‌ అబూ సయ్యద్ సన్నిహితుడు నమోదు చేశారు. 

జూలై 19న మొహమ్మద్‌పూర్‌లో విద్యార్థుల నిరసనలో పోలీసు కాల్పులు జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఆ కాల్పుల్లోనే అబూ సయ్యద్‌ మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నా​యి. ఈ హత్య కేసులో మాజీ ప్రధాని షేక్‌ హసీనాతో సహా అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ క్వాడర్, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా అల్ మామున్‌పై నిందితులుగా చేర్చారు. బంగ్లాలో చోటుచేసుకున్న నిరసనకారులు అల్లర్లలో ఇప్పటివరకు మొత్తం 560 మంది మృతి చెందారు.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు