Breaking News

44 వేలు దాటిన మరణాలు

Published on Fri, 11/22/2024 - 06:28

దియర్‌ అల్‌–బలాహ్‌ (గాజా స్ట్రిప్‌): ఇజ్రాయెల్‌తో 13 నెలలుగా సాగుతున్న యుద్ధంలో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 44,000 దాటిందని గాజా ఆరోగ్యశాఖ అధికారులు గురువారం వెల్లడించారు. ఇందులో సాధారణ పౌరులు ఎంతమంది, హమాస్‌కు చెందిన వారెందరు అనేది గాజా ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా లెక్కించదు. కాకపోతే మృతుల్లో సగం కంటే ఎక్కువమంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపింది.

 ఇజ్రాయెల్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి 44,056 మంది పాలస్తీనియన్లు మరణించారని, 1,04,268 గాయపడ్డారని ఆరోగ్యశాఖ తెలిపింది. వాస్తవ మృతుల సంఖ్య ఇంకా అధికంగా ఉండొచ్చని, మెడికోలు చేరుకొలేని ప్రదేశాల్లో శిథిలాల కింద చిక్కుకొని అనేక మంది మరణించారని వెల్లడించింది. మరోవైపు 17 వేల మంది పైచిలుకు హమాస్‌ మిలిటెంట్లను మట్టుబెట్టామని ఇజ్రాయెల్‌ సైన్యం చెబుతోంది. గత ఏడాది అక్టోబరు ఏడో తేదీన దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఆకస్మిక దాడితో యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. హమాస్‌ జరిపిన ఈ మెరుపుదాడిలో 1,200 మరణించగా, 250 మంది ఇజ్రాయెల్‌ పౌరులను బందీలుగా పట్టుకున్నారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)