Breaking News

న్యూజిలాండ్‌లో కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి 

Published on Thu, 07/20/2023 - 07:58

ఆక్లాండ్: 2023 ఫిఫా మహిళల ఫుట్ బాల ప్రపంచకప్ కు వేదికైన ఆక్లాండ్ లో టోర్నమెంట్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా పోలీసు అధికారులతో సహా మరో ఆరుగురు గాయాల పాలయ్యారని తెలిపారు న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్ హిప్కిన్స్. 

ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ కు ఉండే క్రేజే వేరు. అందులోనూ ఫిఫా ప్రపంచ కప్ అంటే అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం నెలకొంటుంది. తాజాగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్ బాల్ అభిమానులు జంట ద్వీపదేశాల్లో వాలిపోతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేశారు నిర్వాహకులు. 

ఇదిలా ఉండగా ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్ నార్వే మహిళల జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కు కొద్ది గంటల ముందు ఆక్లాండ్ నగరంలో కాల్పులు బీభత్సాన్ని సృష్టించాయి. ఒక ఆగంతకుడు నిర్మాణంలో ఉన్న భవనంలోకి దూరి కాల్పులు ప్రారంభించాడు. పోలీసులు అప్రమత్తమై వెంటనే కౌంటర్ అటాక్ చేయగా అగంతకుడి తోపాటు పోలీసుల్లో ఒకరు కూడా మృతి చెందినట్లు, మరో ఆరుగురు గాయపడియట్లు తెలిపారు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్.  

న్యూజిలాండ్ ప్రధాని తెలిపిన వివరాల ప్రకారం కాల్పులు జరిగినప్పుడు పోలీసులతోపాటు పౌరులు చూపిన తెగువ అసాధారణమని, మృత్యువుకి ఎదురెళ్లి వారు చేసిన సాహసం కొనియాడదగినదని అన్నారు. ఈ సందర్బంగా ఇది ఉగ్రవాద చర్య కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ కప్ టోర్నమెంట్ నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తవని మ్యాచ్లు యధాతధంగా జరుగుతాయని తెలిపారు.

ఇది కూడా చదవండి: బ్యూటీ పార్లర్ల నిషేధానికి నిరసనగా రోడ్డెక్కిన ఆఫ్ఘాన్ మహిళలు..   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)