Breaking News

Somalia: బీచ్‌లో ఆడుతున్నవారిపై తూటాలు..32 మంది మృతి

Published on Sun, 08/04/2024 - 08:13

సోమాలియాలో ఘోరం చోటుచేసుకుంది. సముద్రతీరంలో ఎగిసిపడుతున్న కెరటాలతో ఉత్సాహంగా ఆడుకుంటున్న వారిపైకి ముష్కరుల తుపాకీ గుళ్లు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో 32మంది మృతి చెందారు.

సోమాలియా రాజధాని మొగదిషులోని రద్దీగా  ఉన్న బీచ్‌లో అల్-షబాబ్ ఆత్మాహుతి బాంబర్లు అకస్మాత్తుగా దాడికి పాల్పడి, 32 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఇటీవల జరిగిన అత్యంత దారుణమైన దాడుల్లో ఇదొకటని పోలీసులు అన్నారు. అల్-ఖైదాతో సంబంధం కలిగిన జిహాదీలు  గత కొన్నేళ్లుగా ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. వారు తాజాగా లిడో బీచ్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. కొద్దిక్షణాల్లోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి.

బీచ్‌లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందగానే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సోమాలి నేషనల్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం దాడి చేసినవారిని  భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. లిడో బీచ్‌లో గతంలోనూ అల్-షబాబ్‌తో సంబంధం కలిగిన ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. నాటి దాడిలో తొమ్మిది మంది మృతిచెందారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)