Breaking News

వీడు హీరో అయితే..  ఏ మిషనైనా పాజిబుల్‌! 

Published on Sun, 07/09/2023 - 03:28

4 వేల అడుగుల ఎత్తున్న ఒక పర్వతం.. అక్కడ ఫుట్‌పాత్‌ సైజులో ఉన్న స్టీల్‌ ర్యాంప్‌.. దానిపై ఒక వ్యక్తి 200 కిలోమీటర్ల వేగంతో బైక్‌పై దూసుకెళ్తున్నాడు.. అందరూ అలా నోరెళ్లబెట్టి చూస్తున్నారు.. అంతే.. ఒక్కసారిగా పర్వతం మీద నుంచి జంప్‌ చేసేశాడు.. అందరి గుండెలు దడదడలాడుతున్నాయి.. మృత్యువుకు అతనికి మధ్య ఉన్నది ఒక్క పారాచూట్‌ మాత్రమే.. దాన్ని సమయానికి తెరవకుంటే.. అతడి శవం ఆనవాలు కూడా దొరకదు.. పారాచూట్‌ తెరుచుకుంది. అతడు క్షేమంగా ల్యాండ్‌ అయ్యాడు. ప్రపంచ సినిమా చరిత్రలోనే అతిపెద్ద స్టంట్‌గా పేరొందిన ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఆ వ్యక్తి..   టామ్‌ క్రూజ్‌.. హాలీవుడ్‌ డాషింగ్‌ హీరో.. వయసు జస్ట్‌ 61 ఏళ్లు!!!

మిషన్‌ ఇంపాజిబుల్‌ సిరీస్‌లోని తాజా చిత్రం డెడ్‌ రెకనింగ్‌  పార్ట్‌ 1 కోసం ఈ సాహసాన్ని చేశారు. సినిమాలో కేవలం  60 సెకన్లు ఉండే ఈ సన్నివేశం కోసం రిహార్సల్స్‌ మూడేళ్ల  క్రితం ప్రారంభమయ్యాయని ఈ చిత్ర స్టంట్‌ కోఆర్డినేటర్‌ ఈస్ట్‌వుడ్‌ చెప్పారు. శిక్షణలో భాగంగా మన హీరో 13 వేల మోటార్‌ క్రాస్‌ జంప్స్, 500 స్కైడైవ్స్‌ చేశారట. ‘200 కిలోమీటర్ల వేగంతో బైక్‌ మీద వెళ్లి.. పర్‌ఫెక్ట్‌గా జంప్‌ చేయాలి.

అదే సమయంలో గాలిలో కరెక్టు టైంకి బైక్‌ను వదిలేయాలి.. భూమికి 500 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు పారాచూట్‌ను తెరవాలి. సరిగా బాలెన్స్‌ చేసుకుంటూ నేలపై దిగాలి. ఇందులో ఏ ఒక్క విషయంలో చిన్నపాటి తేడా జరిగినా ఇక అంతే.. టామ్‌కు చిన్నప్పటి నుంచి బైక్‌ డ్రైవింగ్‌ మీద మంచి గ్రిప్‌ ఉంది. అది ఇక్కడ ఉపయోగపడింది’ అని ఈస్ట్‌వుడ్‌ తెలిపారు.  

మీకో విషయంలో తెలుసా..? 
ఒక బైక్‌ మీద వేగంగా వెళ్లి.. పర్వతంపై నుంచి దూకి.. వెంటనే పారాచూట్‌ తెరిచి.. ల్యాండ్‌ అవ్వాలన్నది టామ్‌ క్రూజ్‌ చిన్నప్పటి కల అట. చిన్నప్పుడు ఇంట్లో ర్యాంప్‌లాంటిది ఏర్పాటు చేసుకుని.. సైకిల్‌ మీద ఇలా జంప్‌ చేసిన ఘటనలు ఎన్నోనట. అలాగే దెబ్బలు తిన్న ఘటనలు కూడా.. ప్రాణాలకు తెగించి మరీ చేసిన ఈ స్టంట్‌తో ఇన్నాళ్లకు ఆయన కల తీరిందన్నమాట. ఈ వీడియోను నెట్లో చూసినోళ్లంతా సూపర్‌ అనేస్తున్నారు. ఏంటీ సింపుల్‌గా సూపరా..     

– సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)